జనని గర్భము నుండి జన్మించినప్పుడు
కంఠమాలలవేవి కానరావు
మంచిముత్యపు సరుల్ మచ్చునకును లేవు
మేల్మి బంగరు దండ మెడకు లేదు
రత్నాల హారముల్ రంజిల్లగా లేవు
పచ్చలు, కెంపులు పొదగ లేదు
వత్రాల హారముల్ వర్ధిల్లగా లేవు
గోమేధికంబులు తోడు లేవు
కలదు కలదొక్క మాల మీ కంఠమందు
ఎన్ని చేసిన అవి యన్ని ఎంచి ఎంచి
మంచియైనను చెడుగైన త్రుంచకుండ
బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల
కర్మలన్నియు చేర్చిన కంఠమాల
(సపా. మే 2000 పు. 142)