ఎప్పుడు దుర్గుణసద్గుణములు ఒక్కటయి గుణరతుహిలు కాగలరో అప్పుడే శాంతి ఏర్పడును. అప్పుడు ఈ యుద్ధరంగమైన అస్థిపంజరము ఉండదన్న మాట. యుద్ధమున్నకదా యుద్ధరంగము? యుద్ధమే లేకున్న యింక రంగ మెక్కడిది? ఈ యుద్ధము లేకుండ చేసికొన వీలులేదా?
ఎందుకు లేదు? వ్యామోహము లను ప్రజ లున్నకదా యుద్ధమును జరిపింతురు? అట్టి ప్రజలే లేకున్న యుద్ధమూ లేదు. కాన మొదట వ్యామోహములు, మమకార అహంకారములూ లేకుండా చేసి కొన్న శాంతిగా ఉండవచ్చును. అట్టి శాంతికి ప్రయత్నించు.
(స. ని..పు.88)