జీవుని స్వయముగా సుఖ స్వభావుడు, ఆనంద స్వరూపుడు; వాడు దేహ స్వరూపమున లేడు. దేహము తాను కాడు. ఆత్మేతాను, ఆత్మకు సుఖం సహజము. ఆ కారణముచే దుఃఖమునకు తాను ఇష్టపడడు. ఆ సుఖమునకు ఆశ్చర్యము లేదు. లేనిది చూచినపుడే లోకమునకు ఆశ్చర్యము. నిత్యమూ చూచువాటిపై యెవ్వడూ ఆశ్చర్యము పొందడు. సహజమునకు విరుద్ధమయిన, అపుడు ఆశ్చర్యమునకు గురి అగును.
(గీపు. 129)