“శరీర మాద్యం ఖలు ధర్మ సాథనం " ఏది మన ధర్మము? సత్యమే మన ధర్మము, శాంతమే మన ధర్మము, ప్రేమయే మన ధర్మము. తీపి లేనిదే చక్కెర కాదు. దహన శక్తి లేనిది నిప్పు కాదు. అదేవిధంగా ప్రేమ లేనివాడు మానవుడే కాదు. మానవుని యందు ప్రేమ ఉన్నది. కానీ దానిని భార్యాబిడ్డల పై, బంధుమిత్రులపై ప్రసరింపజేస్తున్నాడు. ఆపద్బంధువైన భగవంతుణ్ణి విస్మరించి, లోక సంబంధమైన బంధువు లను విశ్వసిస్తున్నాడు మానవుడు.
బంధువలందరు వాకిటిదాకను
వల్లకాటికిని వత్తురుగా
బంధమణచి విను బాయని
ఆపద్బంధువు భగవన్నామమెరా!
మానవుడా! నీవు మానవత్వాన్ని ధరించినందుకు ఎంతో ధన్యత పొందాలి. "జంతూనాం నరజన్మ దుర్లభం".
మానవ జన్మ అతి దుర్లభమైనది. ఇలాంటి జన్మ నెత్తినందుకు నీవోక ఆదర్శాన్ని అనుసరించి, అందరికీ అందించాలి. ప్రాపంచిక సంబంధమైన పనులను చేసుకో, తప్పు లేదు. కానీ చిత్తమునందు నివృత్తిని నింపుకో, నర్తకి నాట్యం చేసే సమయంలో చేతులు, కన్నులు త్రిప్పుతూ ఎన్ని విధాలుగా అభియనం సల్పి నప్పటికీ తాళం ఏమాత్రము తప్పకుండా నృత్యం చేస్తుంది. అదేవిధంగా,మానవుడు ఎన్ని పనులలో మునిగియున్నప్పటికీ దివ్యత్వాన్ని మరచిపోకూడదు. మాయను ఒక నర్తకితో పోల్చవచ్చు. ఆ నర్తకి" మనకు వశం కావాలంటే కీర్తన చేయాలి.
హరేర్నామ హరేర్నామ హరేర్నామైన కేవలం
కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యే గతిరన్యథా.
(స. సా..మా. 99, పు.77)
ఈనాటి యువతీయువకులు ప్రేమ అంటే ఏమిటి, సత్యమంటే ఏమిటి, దైవమంటే ఏమిటి అని చక్కగా గుర్తించినప్పుడే మీ జీవితము కూడా రాజమార్గములో ప్రయాణమవుతుంది. ఏమిటి ఈ నీటి బుడగ వంటి దేహమునకు, పిచ్చికోతి వంటి మనస్సుకు ఏమి సంబంధముంటున్నది? ఏదో మన భ్రాంతి చేత యిన్ని అవస్థలకు గురైపోతున్నాము. ఈనాటి మానవుని మనస్సు ధనము పైనే Concentration చేస్తున్నది. ఏమి చేసినా ధనము. ఎక్కడికి పోయినా ధనము. ఎక్కడ చూచినా ధనము. ఈనాటి యువతీయువకులంతా విదేశములకు బయలుదేరిపోతున్నారు. ఎందుకోసం పోతున్నారు? ధనము కోసం పోతున్నారు. ధనము యిక్కడుండి సంపాదించుకోకూడదా! ధనము కావలసినదే. అవసరమే. ఎంతవరకు కావాలి? మీరు బ్రతకటానికి ధనము కావాలి. ఈ దేశములో నీవు బ్రతకటానికి వీలులేదా! నారు పెట్టినవాడు నీరు పోయడా? మితిమీరిన ధనము సంపాదించటము వలన suffering. రెండు చేతులిచ్చాడు. ఒక కడుపు యిచ్చాడు. రెండు చేతులతో నీవు పనిచేస్తే కడుపు నిండదా? ఇదే నీవు చేయవలసిన తపస్సు, hands in the society, head in the forest.అంతే గాని శాంతి అంటే ఎక్కడ చిక్కు తుంది? దండిగా ధనము సంపాదించుకొని I am enjoying. Enjoy అంటే ఏమిటి? అన్ని సుఖములు పొందటమా enjoy అది కాదు. ఈ పదమునకు సరియైన అర్థము తీసుకోవాలంటే enjoy..enjoy కథ చెప్పాడు. సాయినాథ్, రామ, కృష్ణ గోవింద, మాధవ పేర్లు పెట్టుకుంటున్నాడు నలుగురు కుమారులకు, అందరికి ఎక్కడ దూరమైపోతానేమోనని అందరికి షాపులు కట్టించాడు. కానీ కట్టకడపటికి ఏమైపోయింది? రాముడు వచ్చాడా, కృష్ణుడు వచ్చాడా, మాధవుడు వచ్చాడా, గోవిందుడు వచ్చాడా? ఎవరు పోలేదు. కట్టకడపటికి తానే పోయాడు. తాను సంపాదించిన ధనము గానీ, తాను సంపాదించిన గృహము గానీ ఏదీ తన వెంట రాలేదు.
బంధువులందరు వాకిటిదాకను
వల్లకాటికిని వత్తురుగాని
బంధమణచి నిను బాయని ఆప
ద్బంధువు భగవన్నామమెరా!
అదొక్కటే మన వెంట జంటగా – యింట ఉండేది.
(శ్రీ,. స. పు. 26-27)