బ్రతికినన్ని నాళ్లు ఫలము లిచ్చుటేగాక,
చచ్చిచూడ తనువు కోసిఇచ్చు".
ఈ వృక్షము కంటే త్యాగి మరొకటి ఉన్నదా;
"త్యాగమందు వృక్షంబె గురువు"
కనుక మానవత్వంలో త్యాగం అత్యవసరం. ఏనాటికైనా త్యాగం లేకుండా మనకు భోగంగాని, ఆనందంగాని లభ్యం కాదు. కనుక త్యాగానికి మనం ఇప్పటి నుంచే కృషి చేయాలి. "ఆల్ప బుద్దుల నెంత నాదరించినగాని, కీడు చేయు ఎట్టివానినైనా " కనుక మనం ఆల్పులం కారాదు. ఆధికులం కావాలి.
(శ్రీ. సె. 2001 పు. 12)