ఇంక విహారము మనము ఏవిధమైన ప్రదేశమునకు వెళ్ళాలి? ఏవిధమైన వాతావరణములో జీవించాలి? అనే విషయమును చక్కగా విచారించాలి. ఎట్టి వారితో సంబంధబాంధవ్యమును పెంచుకోవాలి? దుస్సంగముతో మనము దూరముగావుండాలి. దుష్టులు చెలిమి దూరముగా ఉంచాలి. కారణమేమనగా ఎట్టి సంగమును మనము అనుభవిస్తామో అట్టి భావములు మనలో ఆవిర్భవిస్తాయి. Tell me your company, I shall tell you what you are అన్నారు. నీవు ఎలాంటి సంగములో కూడి వుంటావో అలాంటి వాడుగా తయారవుతావు. కనుక దుస్సంగమును దూరముగా ఉంచాలి. కానీ యీనాటి యువకులకు దుస్సంగము చాలా అభిరుచిగా ఉంటుంది. దుష్కర్మలలో చాలా సులభముగా ప్రవేశిస్తున్నారు. దురాచారములు చాల సులభముగా జరుపుతున్నారు. ఇది మానవ దేహమునకు సరియైనవిలువ కాదు. “జంతూనాం నరజన్మ దుర్లభం" ఇంత దుర్లభమైన మానవజన్మ ఎత్తి మనము ఈ విధమైన పెడమార్గమును పట్టటము మానవత్వానికి తీరని లోటు కనుకనే ఋషులందరు ఈదేహముచేత సత్కర్మలు ఆచరించే నిమిత్తమై భగవచ్చింతన చేసే నిమిత్తమై, ఏకాంత ప్రదేశమునకు వెళ్ళి తపస్సులు ఆచరిస్తూ వచ్చారు. నీవుద్దేశ్యము అది కూడా ఒక బలహీనత. ఒక చిన్న ఉదాహరణ నీవు కోపాన్ని జయించాలని సంకల్పించుకున్నావు. అరణ్యములో కూర్చుని ఎన్ని సంవత్సరముల తపస్సు చేసినా నీవు ఈ కోపమును జయించలేవు. ఈ కోపమునకు కారణము యేమిటి? అని విచారించాలి. ఏ స్థానములో నీకు కోపము ఆవిర్భవిస్తుందా.? జన సమూహములోనే కోపము ఆవిర్భవిస్తూండాది. కనుక నీవు జన సమూహమునందే వుంటుండి. ఆ కోపమును అరికట్టటానికి ప్రయత్నించాలి గాని ఏ జన సమూహములేని అరణ్యములోకి పోయి కోపాన్ని అరికట్టాననుకుంటే అది నీభ్రమగానే వుంటుంది. అరణ్యములో వుండినంత వరకు శాంతముగా ఉండవచ్చును. కాని తిరిగి నీవు గ్రామములో ప్రవేశించే టప్పటికి అది సిద్ధము సుమతీ అని ప్రవేశిస్తుంది. .
(బృ,త్ర.పు.19)
(చూః దేహము)