మానవుడు సాధనలు చేస్తున్నాడంటే కేవలము మానసిక సంతృప్తి నిమిత్తమై చేసే ప్రక్రియలే. మనస్సునే నిర్మూలనము గావించుకొనవలెనని వేదాంతము బోధించుచుండగా, మనసుని సంతృప్తి పరిచే సాధనలు చేయడం, దానిని బలపరచినట్లవుతుంది. సాధనలు చెయ్యాలని సంకల్పించుకొంటే, ఆత్మ భావమును దూరము గావించుకో, ఆత్మానందమును అందుకొన గోరినప్పుడు దృష్టిని ఆత్మవైపు మరల్చు. మోక్ష ప్రాప్తి నిమిత్తమై, ఆత్మానుగ్రహ నిమిత్తమై, ఆత్మజ్ఞాన నిమిత్తమై, ఆత్మానంద నిమిత్తమై సాధనలు చేయటం భ్రాంతియే. నీవే ఆత్మ వై యుండి నీవు ఆత్మ నిమిత్తమై మరొక దానిని ప్రార్థనగాని సాధనగాని చేస్తే, నీయొక్క తత్వమును ఏరీతిగా గుర్తించగలవు? ఈ సాధనలన్నీ మనస్సును చల్లబరుస్తాయి. మనస్సును చల్లబరచి ప్రయోజనం ఏమిటి? మనస్సే లేకుండా చేసుకోవాలి. మనోనాశన నిమిత్తమై ఆచరించే సాధనలే ఆత్మాన్వేషణకు సరియైన సాధన.
(శ్రీ భ ఉ.పు.7)
(చూ|| భగవదన్వేషణ)