అధ్యాపకులు ఆదర్శమైన జీవితాన్ని గడపాలి. వారు ఆచరించి, ఆనుభవించి, పిల్లలకు అందించాలి. ఆచరించేవాడు ఆచార్యుడు. ఆచరించకుండా ఆచార్యు డనుపించుకోవాలనుకోవటం కేవలం ఆర్టిఫిషియల్ (కృత్రిమమైన) జీవితమే అవుతుంది. తాను ఆచరిస్తూ, ఆచరించిన విషయాలను మాత్రమే విద్యార్థులకు బోధిస్తూ ఆచార్యుడు అనే పేరును సార్థకం చేసుకోవాలి. విద్యార్థులను ఆందోళన దిశకు మరలించకుండా, వారికి నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శీల సంపత్తులను ఇనుమడింప చేసే ఎడ్యుకేషన్‌ను అందిస్తూ వారిని ఎలివేట్ చేయాలి.
(శ్రీ జ. 97 పు. 68)