లౌకిక విద్యలకు ఎట్లు గురువు అవసరమో వేదాంత విద్యలకు కూడనూ ఇది అవసరము. గురు భక్తి వలన గురువునకు కలిగిన శిష్యవాత్సల్యము శిష్యుని ఉత్తమ స్థితికి తేగలదు. అయితే గురిలేని గురుత్వము భ్రష్టమై పోవును. దూడను చూచి ఆవు చేపుకు విడచినటుల శిష్యుని చూచి గురువు అనుగ్రహమును అందించవలెను. భగవంతుని పొందగోరుటకు మోక్ష ప్రాప్తి నొందుటకు గురుబోధనలే ఆధారములు అని తెలిపెను.
(గీ.పు. 208)