విప్రలిప్ప అనగా ఓర్వలేని తనము,అసూయ, ఈ ఆసూయ మానవునకు చాలా చెడ్డ గుణము. ఎవరైనా వున్న వారిని చూస్తే ఓర్వలేడు. ఎవరైనా మంచివారిని చూస్తే ఏమాత్రము సహించుకోలేదు. లోకములో ఏరోగమునికైనా ఔషధముండవచ్చునేమో గానీ యీ అసూయ అనే రోగమునకు నివారణ చేసే ఔషధము ఎక్కడా లేదు. ఇతరుల మంచిని చూచి ఓర్చుకో లేకుండా పోవటము చెడ్డ గుణము. మంచిని చూచి ఆనందించు. ఆనందించే వారిని చూచి నీవు కూడా ఆనందించు.అంతేకాని వారి పైన వీరి పైన ఆసూయ అభివృద్ధిపరచు కోకూడదు.
ఈ అసూయ భావము రావడానికి కారణము స్వార్థము.
(బృత్ర.89)