పాపభీతిలేని పామరత్వముబట్టి
దైవప్రీతి లేని దానిబట్టి
మానవత్వమణగే మానవులందున
విశ్వశాంతి కిదియె విప్లవంబు.
ఈనాడు విశ్వశాంతికి విప్లవము సంభవిస్తున్నారంటే కారణము ఏమిటి? పాపభీతి, దైవ ప్రీతి, సంఘవతిని కోల్పోయినాము. ఆకారమానవత్వములోనే మనము జీవిస్తున్నాము. ఆకారమానవత్వమువల్ల లోకమునకు ఏమాత్రము మంచి చేయలేరు. ఆచారవిచారమానవునిగా రూపొందాలి, ఆచారవిచారము లేక ఆకారమానవునివల్ల వచ్చే ప్రమాదమే యీనాటి పరిస్థితి.
(బ్బ.త్ర, పు.7)