సిద్ధిబుద్ధులను ఆధిపతిగా చేసుకొనినటువంటివాడు వినాయకుడు మనస్సు సుద్ధిగా ఉన్నప్పుడే జ్ఞానసిద్ధి లభిస్తుంది. కనుక బుద్ధి సిద్ధినాయకుడు వినాయకుడు. ప్రతి మానవుడు బుద్ధిని అదుపులో ఉంచుకోవాలి. పండుగ దినాలలో మనం అనేక విధములైన వంటలుచేసుకుంటుంటాం. కాని వినాయక పండుగకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉన్నది. మానెలో ఉడకని వస్తువులను మాత్రమే వినాయకునికి నైవేద్యంగా యిస్తుంటారు. కేవలం ఆవిరితో ఉడికినటువంటి వాటినే వినాయకునకు నైవేద్యం పెడుతాం. ఆయుర్వేదంలో కూడా ఆవిరితో పుడికిన పిండివంటలు త్వరగా జీర్ణమవుతాయని పేర్కొనబడింది భాద్రపదమాసంలో నవ్వులు, బెల్లం వంటలు అధికంగా మన ఇండ్లకు వస్తుంటాయి. నువ్వులపిండి బెల్లం కలిపి దానిని, బియ్యం పిండిని ఆవిరిలో ఉడకపెట్టినదానిలో పెట్టి దీనినే కుడుములు ఉండ్రాళ్లు అని వినాయకునికి నైవేద్యం పెడుతుంటారు. బెల్లం కపపిత్తాదులను నివారించుతుంది, నువ్వులపిండి శ్వాస కోశములను పరిశుద్ధ పరుస్తుంది మరియు దృష్టిని కూడా అభివృద్ధి చేస్తుంది. బాహ్యదృష్టితో పాటు, జ్ఞాన దృష్టిని కూడా పోషించేటటువంటివి ఈ కుడుములు, ఉండ్రాళ్లు,
(శ్రీ ఆ.95 పు.6)