ప్రేమస్వరూపులారా! వినాయక చవితి అనగా వినాయకుని పుట్టిన దినమని అనుకుంటున్నారు. కాని, అతనికి చావులేదు. పుట్టుక లేదు. ఆది, అంత్యములు లేవు. ఆలాంటి విఘ్నేశ్వరునకు ఇది పుట్టిన దినమని భావించడం చాల పొరపాటు. భారతీయుల పర్వదినము లన్ని పవిత్రమైన అంతరార్థంతో కూడినవి. పాయసమును వండుకొని భుజించినంత మాత్రాన అది పర్వదిన మవుతుందా? భగవత్తత్త్వానికి ప్రాధాన్యత ఇచ్చినదే పర్వదినము.
(ప.3.వ.99 పు. 290)