వినాయకుడు

వినాయకుని భార్యల పేర్లు బుద్ధి సిద్ది అన్నారు. అనగాఈ బుద్ధికి, జ్ఞానమునకు అధిపతి అయినటువంటి వాడు కనుక వినాయకుడు. ఈ రెండింటికినీ పతి గా భావిస్తూ వచ్చారు. బుద్ధికి నాధుడైన వానివలనే మనకు సుఖము, జ్ఞానము, ఆనందము ప్రాప్తిస్తుంది. కనుక మనం సుఖజీవితం గడపాలనుకుంటే, ఇంద్రియములను భగవదర్పితం గావించాలి మన మనస్సును భగవంతుని వైపు మరల్చాలి బుద్ధికే మనం స్వాధీనం అయిపోవాలి. దీనినే "బుద్ధి గ్రాహ్యమతంద్రియమ్" అన్నారు. శరీరము కేవలము పదార్థములచేరిక. దీనికి పైన ఉన్నటువంటివి ఇంద్రియములు. ఇంద్రియములకు పైన మనస్సు మనస్సుకు పైన బుద్ధి బుద్ధికి పైన ఉన్నది ఆత్మ, ఆత్మకు బుద్ధికి డైరెక్టు కనెక్షన్ ఉన్నది. ఆత్మయొక్క తేజస్సు, ప్రశాంతి మొదట బుద్ధికి సోకుతుంది. కనుక బుద్ధిని సరియైన బుద్ధిగా మనం పోషించుకోవాలి మంచిబుద్ధిగలవాడే సరియైన జ్ఞాని అవుతాడు. కనుక బుద్ధి యొక్క సుద్దియే "జ్ఞానపిద్ది" అన్నారు.

(శ్రీ.ఆ.95 పు. 9)

 

వినాయక పూజ ప్రాచీన కాలము నుండి వచ్చింది. నారాయణోపనిషత్తు నందు మొట్టమొదట వినాయకుని ప్రార్థించడం జరిగింది. సూర్యుడ్ని చాలా ప్రధానంగా భావిస్తూ వచ్చారు. చతుర్వేదములయందు కూడా వినాయక మంత్రాలు ఎన్నో ఉన్నాయి. వినాయకుడు పరిశుద్ధమైన హృదయముగలవాడు. సిద్ధి, బుద్ధి అతని నేత్రములు.

 

ఈ నేత్రములనే తాను పత్నులుగా భావించాడు. కనుకనే సిద్ధి బుద్ధి నాయకుడు వినాయకుడు అన్నారు. సిద్ది వుండాలంటే బుద్ధి ఉండాలి. బుద్ధి ఉండాలంటే మనలో కృతజ్ఞతా భావమును పెంచుకోవాలి. కృతఘ్నుడి బుద్ధికూడా నాశనమవుతుంది. ఈ బుద్ధియే నాశనం అయిన తరువాత, యిక సిద్ది, మనకు ఏ రీతిగా కలుగుతుంది? వినాయకుడు విజయానికి, సంకేతం. ఇలాంటి వినాయక తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. ప్రతి శుభకార్యానికి ముందు వినాయకుని ప్రార్థించాలి. ఎవరికైనా ఒక నాయకుడుంటాడుగాని, వినాయకునికి మాత్రం నాయకుడు లేడు. ర్వమునకూ నాయకుడు వినాయకుడు. అట్టి నాయకుడులేని వినాయకుడ్ని ప్రార్థించకుండా, అహంకారంతో ప్రవర్తిస్తే చాలా విఘ్నములు కలుగుతాయి. అన్ని పర్వదినములు కన్నా మొట్టమొదటిది వినాయక చవితి పండుగ. పర్వదినములు వినాయక చవితితో ప్రారంభమవుతాయి. శారీర, మానసిక, ఆధ్యాత్మిక లములకు మూడింటికీ వినాయకుడే మూలం. మనం ఈ మూడింటిని కాపాడాలి.

 

మన కాలేజీలో MBA ని ప్రారంభించాం. MBA అంటే ఏమిటి అంటే పిల్లలు Master of Business Administration అంటారు. కాదు M కాదు. M అంటే మనసు (Mind) B అంటే బుద్ధి మరియు Body (శరీరం) A ఆంటే ఆత్మ. ఈ మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపమే MBA విచారణ చేయటానికి మనకు మనను"నందించాడు. దేహమును దానిని అమలు పరచడానికి యిచ్చాడు. ఈ రెండు తమ కర్తవ్యాన్ని చేస్తున్నాయా? లేదా? అని Watch చేయడానికి ఆత్మ ఉంటున్నది. ఆత్మ శాశ్వతమైనది. మనసు మొట్ట మొదట చంచలమైనది. దానిని సక్రమమైన మార్గంలో పెట్టి, సరియైన స్థితిలో అనుభవించి, నేను మానవుడను! మానవునకు తగినటువంటి మనసా! నాది. లేక మృగమునకు తగినటువంటి మనసా! నాది అని విచారణ చేసి, మానవునకు సంబంధించి నటువంటి మనసును అక్కడ ప్రవేశపెట్టాలి. ఇక "B" అనగా Body మనసు నిర్ణయించిన దానిని Body పనిలో ప్రవేశపెట్టాలి. అయితే ఇక్కడ బుద్ధికి విచారణశక్తి ఉంటుండాలి. ఈ మనసు నిర్ణయం చేసినటువంటిది సరియైనదా? కాదా! తప్పా! ఒప్పా! ఆనేటటువంటిది విచారణ చేస్తుంది. ఇది మంచిది అయితే అప్పుడు బుద్ధి దానిని ఆత్మకు అందిస్తుంది. అది సక్రమమైనది కాకపోతే అది ఆత్మ వరకు చేరదు. కనుక ప్రతిమానవుడూ మనో దేహబుద్దుల ఆత్మ తత్త్వమును గుర్తించాలి. మొట్టమొదట మనసును పరిశుద్ధ పరచాలి. మనసును పరిశుద్ధ పరచక పోతే బుద్ధి ఏమాత్రం అంగీకరించదు. అదియే "బుద్ధి గ్రాహ్యమతీంద్రియం". ఇంద్రియముల పై పోతున్నాం. మనసును అనుసరిస్తున్నాం. Mind is the Master of Senses. ఏమి ప్రయోజనం ? Senses ను కంట్రోల్ చేయటం లేదు. నాది చాలా Sensitive Mind అంటారు . ఏమిటి ఈ Sensitive? Animal Sensitive కనుక Master the Mind, be A Master Mind. Senses ను నిజంగా కంట్రోల్ చేసేమైండే Master Mind. ఇట్టి మనస్తత్వం లోపల వినాయకునది. ప్రప్రధమస్తానం. తాను కేవలం సాక్షీభూతుడుగా వుంటాడు. దీనికి జవాబు చెప్పడు. ఆచరణ చేసి చూపిస్తుంటాడు. కనుకనే వినాయక తత్త్వము అత్యంత ఆదర్శవంతమైనది. ఆత్మతత్త్వము లన్నింటిని చూపిస్తుంది. విచారణ చేస్తుంది. కాని దానిలో ప్రవేశించదు. ఈ మనో దేహముల ఆధికారి అయిన ఆత్మ దేనిలోనూప్రవేశించదు. ఈ మనోబుద్ధలు హృదయపూర్వకంగా పశ్చాత్తాపము పొందినప్పుడు, ఇది నాది తప్పు అని గుర్తించినప్పుడు, ఆత్మ సాక్షీభూతమై ఉంటుంది.

(శ్రీ.సె.2001 పు. 13/14)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage