ప్రతి గృహస్థు, ప్రతి దినము ఆరు రకముల విధులను నిర్వర్తించవలెను అవి. 1. స్నానము, 2. సంధ్య, 3. జపము, 4. హోమము, 5. పూజ, 6. అతిధి సత్కారము. అనగా ఉదయము స్నానము చేసి భగవంతుని నామస్మరలు చేయుట. పవిత్ర అగ్నిలో పవిత్ర పూజాద్రవ్యములు వేసి హోమము చేయుట. భగవంతుని పూజించుట, అతిధి దేవుళ్లను ఆదరముతో సత్కరించవలెను. సేవాతురుడవైన సేవకుడవు నీవు. ప్రజలు నిన్ను దూషించినను, భూషించినను. నీవిధిని నీవు సంతోషముగా నిర్వర్తించవలెను. దేహమునకు దూషణ, భూషణలు కాని, దేహికి కాదు అను సత్యము గ్రహించిన నీవు ఇనుమడించిన శక్తి సామర్ధ్యములతో ఏ విధిని నిర్వర్తించగలవు.
(శ్రీ.స.సూ.పు.74/75)