పసి పిల్లవానికి తన నాలుక తనకు ఉంది. అలాగే తల్లికి. తల్లి తొడమీద కూర్చోపెట్టుకొని బిడ్డకు మాటలు ఉచ్చరిస్తూ, మాటలు నేర్పుతుంది. తల్లి నాలుక ఎంత తీరిక లేనిదైనా, బిడ్డ తన నాలుకతోనే మాట్లాడం నేర్చుకోవాలి. బిడ్డ బదులు తల్లి మాట్లాడ లేదు. తన భాద్యత నుండి తప్పించుకోలేదు! గురువు కూడా అటు వంటివాడే! తను పునరుచ్చారణ చేస్తూ, జ్ఞాపకం చేస్తూ ఉత్తేజాన్ని కలిగిస్తూ, నచ్చ జెపుతూ, బోదిస్తుంటాడు; కాని శిష్యుడే ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. అతడే ఆ ఘంటాన్ని చేపట్టాలి. ఆ విధి నిర్వహణలో ఇతరులెవరు తనని పైకెత్తలేరు.
(ఆ.షపు,122)