ప్రాణరక్షణ నిమిత్తమై దైవాన్ని ప్రార్థించమని మహర్షులు ప్రబోధిస్తూ వచ్చారు. ఈ ప్రాణము "నీలతోయద మధ్యస్థాత్ విద్యుల్లేఖేవ భాస్వరా" వెనక వైపునకు 33 రింగులతో కూడిన Spinal Chord ఉంటుంది. దానియందు 9 మరియు 12వ రింగుల మధ్య సుషుమ్న నాడి కలదు. అదే విద్యుల్లేఖ వలె కదలుతుంది. ఆ Lightning వలననే దేహమంతా పనిచేస్తుంది. కొంతమంది మన ప్రాణము Heart లో ఉందంటారు, Heart అనేది కేవలము Main Switch వంటిది. కాని ప్రాణము అక్కడ లేదు. డాక్టర్లు Heart ని తీసి వేరొక Heart మారుస్తున్నారే! ఆ సమయమున ఈ ప్రాణము ఏమైపోతుంది? ఇది కేవలం Main Switch నీ మార్పిడి చేయడం మాత్రమే పెరుగుతోంది. కాని అక్కడ Spinal Column లో దాని ప్రభావము చేతనే Heart పనిచేస్తుంది. కనుకనే ఆనాటి వేదపురుషులంతా ఏమీ తెలియని మూర్ఖులని, ఏ మాత్రము జ్ఞానము లేని, సైన్సు తెలియని అమాయకులుగా భావించరాదు. ఈనాటి సైంటిస్టు తెలిసిన దానికంటే వారికి మరింత అధికముగానే తెలిసియుండినది. దీనికంతటికీ వారి తపశ్శక్తియే కారణము. ఎన్ని వేలమైళ్ళ దూరములో ఉండి తపస్సుచేస్తున్నప్పటికిని, దూరదర్శనము వారికి ప్రాప్తించినది. ప్రకృతితో ముఖాముఖిగా సంభాషణలు సల్పేవారు. ఈనాడు దూరదర్శనమని, దూరశ్రవణమని కోట్ల కొలది ఖర్చు పెట్టి ఆనుభవిస్తున్నాము. ఒక్క నయాపైసా ఖర్చులేదు ఆనాడు. మనస్సు పవిత్రమైన దివ్యత్వముగా మార్చుకోవటం చేతనే ఇన్ని శక్తులు వారికి కలుగుతూ వచ్చాయి.
(ప.3.వాలై.91 పు.173)