"ఈనాడు విద్యా, వైద్య కేంద్రాలన్నీ వ్యాపార సంస్థలైనాయి. వాటిలో బీదలకు సేవ చేసే వాటిని వ్రేళ్ళపై లెక్క పెట్టవచ్చు. అందు కొరకు వంద కోట్లు రూపాయలువెచ్చించి ఈ వైద్యాలయాన్ని నిర్మిస్తున్నాము. ఇక్కడ ఉన్నత విద్యే కాదు, ఉన్నత వైద్యం కూడా ఉచితమే. ఉన్నవాళ్ళు లక్షలు ఖర్చు చేసి అమెరికాలాంటి దేశాల్లో చికిత్స చేసికొంటే పేదవాళ్ల గతేమిటి? వాళ్ళకు ఎవరు మందులిస్తారు? దీనిని దృష్టిలో పెట్టుకునే ఈ బృహత్పథకాన్ని చేపట్టినాము. గుండె ఆపరేషన్ గాని, మూత్ర పిండముల మార్పిడి గాని, ఏదైనా అంతా ఉచితంగానే చేయబడవలెనని నిర్ణయించాము. తదనుగుణంగా 1991 నవంబరు 22వ తేదీన ఈ వైద్యాలయం ప్రారంభింపబడుతుంది.
(స.సాన.99 పు.340)