ఈనాడు విజయదశమి. ఇది పవిత్రమైన పర్వదినముల యొక్క సమాప్తి దినము. పవిత్రమైన ప్రాప్తిని చేకూర్చుదినం. మరొక రీతిగా విచారించి చూచినప్పుడు - షిరిడీ బాబా శరీరము వదలివ దినము ఈ దినము. విజయ దశమి దినమే షేరడీ బాబా తన దేహాన్ని వదలి, తన ఆత్మస్వరూపంతో అనేక విధములైన సంచారములు సల్పి, తదుపరి ఎనిమిది సంవత్సరములకు ఇక్కడప్రవేశించడం జరిగింది. మానవత్వములోని దివ్యత్వమును గుర్తించుకొనవలెనన్న ఈ ఒక్కటి మాత్రమే చాలు.
(ద.స.98 పు.103)