విచారణ శక్తులు

మానవునకు ఐదు విధములైన విచారణ శక్తులుంటున్నవి. దీనినే ఒక విజ్ఞానము అన్నారు. ఈనాడు ప్రపంచమంతా వ్యాపించిన జ్ఞానము ఒకటి. అది తెలివితేటలతో కూడినది. దీనినే పుస్తక జ్ఞానం బుకిష్ నాలెడ్జి అన్నారు. ఈ పుస్తక జ్ఞానం సూపర్ ఫిషియల్ నాలెడ్జి గా మారిపోయింది. ఈ సూపర్ ఫిషియల్ నాలెడ్జిలోపలే మన జీవిత మంతా వ్యర్థము చేసుకుంటున్నాము. ఈ వయస్సు నందు మానవునకు ఉండవలసిన జనరల్ నాలెడ్జి, కామన్ సెన్స్ జీరోగా ఉంటున్నది. జనరల్ నాలెడ్డి, కామన్ సెన్స్ విద్యవల్ల లభించేదికాదు. నిత్య జీవితములో కర్తవ్యధర్మము వల్లనేయీజనరల్ నాలెడ్జిని పోషించుకొనవచ్చును. సమాజ సేవ వల్ల, సమాజ సంపర్కమువల్ల యీ జనరల్ నాలెడ్డిని పోషించు కోవటానికి అవకాశముంటున్నది. ఇంక నాల్గవది విచక్షణజ్ఞానం discrimination knowledge ఇది స్వార్థపరమైన డిస్క్రిమినేషన్‌గా ఉంటుండాది. వ్యక్తి సంబంధమైన discrimination గా వుంటుండాది. కనుకనే యీ డిస్క్రిమినేషన్ పెడమార్గము పడుతుండాది. ఇది సరియైన డిస్క్రిమినేషన్ కాదు. సమిష్టి సంబంధమైన discrimination కావాలి. ఎవరినివాడు సమర్థించుకునే discrimination చూస్తున్నాడు. నాదిరైటు - నాది రైటు అనేది స్వార్థపరమైన discrimination అందువలననే యువకులు పెడమార్గము పట్టటానికి చాలా అవకాశము ఏర్పడుతున్నది. Fundamental discrimination కావాలి. ఎవరికి సంబంధించినప్పటికి అందరికి సమన్వయమయ్యే discrimination గా వుండాలి 2+2=4 ఇది రష్యన్సుగాని, చైనీసుగాని అమెరికన్సుగానీ, పాకిస్తానువారుగాని, ఇండియన్సుగాని అందరు ఒప్పుకోవలసినదే. తప్పదు. కానీ ఆధ్యాత్మిక మార్గము 3-1=1 అంటుంది. ఇది ఎవ్వరు అంగీకరించరు. ఇది fundamental కాకుండా Individual discrimination గా రూపొందుతుంది. ఆధ్యాత్మికము అలాంటి సంకుచితమైన discrimination ఏనాడు చేయదు. వారు అర్థము తెలుసుకోలేక లేదా విచారణ చేసుకోలేక యిది వ్యక్తిగతమైన విచారణ శక్తి అనుకోవచ్చు. ఏ వ్యక్తిని ప్రశ్నించినప్పటికిన 3-1-1 అంటే తప్పు అంటాడు. కాని యిదిరైటు అనినేను వాదిస్తాను. కారణం ఏమిటి? ఇది వ్యక్తిగతమైనది కాదు. సృష్టి సంబంధమైనది. ఆత్మసంబంధమైనది. అమృత సంబంధమైనది ఏ విచారణ శక్తి ద్వారా యిది మార్పు చెందటానికి వీలుకాదు. ఈ విధమైన discrimination లోపల అన్ని విధములైన మార్పులు కలగటం చేతనే మానవత్వాన్ని సక్రమమైన మార్గములో గుర్తించలేక పోతున్నారు. కారణం ఏమిటి? ఐదవవిచారణ శక్తి ఆత్యవసరము. అదే ప్రాక్టికల్ నాలెడ్డి. ఈ ప్రాక్టికల్నాలెడ్డి లేకపోవటం చేతనే యిన్ని అపోహలకు గురైపోతున్నాడు. మానవుడు. ప్రతి విషయమునకుప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. ఈనాడు Practical knowledge అంటే యేమిటో అర్థము కావటం లేదు. ప్రతి వ్యక్తి తనకు సంబంధించినది తన అనుభూతిగా భావిస్తున్నాడు. నేను సమాజములో ఒక్కడిని సమాజపు సమిష్టి తృప్తిని నేను అనుభవించాలి అని విచారణ చెయ్యాలి. సముద్రమునుండి ఏరీతిగా అలలుద్భవిస్తున్నవో, సూర్యుని నుండి ఏవిధముగా కిరణములావిర్భవిస్తున్నవో, ఒకేదైవమునుండి ఆవిర్భవించిన ప్రేమ ప్రేమ భగవంతునికి ఎట్టి భేదము లేదు సూర్యునికి కిరణములకు ఏవిధమైన భేదముండదు. సముద్రమునకు అలలకు ఏవిధమైన భేదములేదు. ఇది అన్యోన్యాశ్రయులు. వీనిది అవినాభావ సంబంధము. అదే విధముగనే యీ దేహము కూడను దివ్యమైన ఆత్మతత్వమునకు సంబంధించినదనే సత్యమును గుర్తించాలి.

(బృత్ర.పు.31/32)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage