నీ హృదయాన్ని మార్దవం చేసుకో, అప్పుడు సాధనలో విజయం త్వరితగతిని లభిస్తుంది. మృదువుగా, మధురంగాభగవంతుని గురించే పలుకు. ఈ విధంగా ఉపరితలాన్ని మెత్తబరచ గలవు. జాలి, దయ అభివృద్ధి పరచుకో, సేవలో పాలు పంచుకో బీదల ఇక్కట్లు, రోగుల ఆర్తనాదాలు, కష్టాలలో ఉన్న వారి నైరాశ్యం అర్థం చేసుకో, - ఇతరుల కష్టసుఖాలు పంచుకో. ఇదే హృదయాన్ని మార్దవం గావించు కోవడానికి, సాధనలో విజయం సాధించడానికిమార్గం.
(అ.ప.పు.75)
"యత్రయెగేశ్వరః కృష్ణ యత్రపార్థోథనుర్ధర
తత్ర శ్రీర్విజయో భూతి: ధ్రువా నీతిర్మతిర్మమ"
ఎక్కడ సర్వశక్తి మయుడైన భగవంతుడుంటాడో, ఎక్కడ సర్వధర్మపరాయణుడైన నిర్మలుడు అర్జునుడు ఉండునో అక్కడనే విజయము. ఈ విజయానికి సత్యధర్మ స్వరూపుడైన భగవంతుని అనుగ్రహమే ప్రధానము. పురాణములు కూడను ఈ సత్య ధర్మములనే ప్రబోధిస్తూ వచ్చాయి.
(బృత్ర.పు.8)
(చూ॥ సత్యం, హిరణ్యగర్భతత్యం)