“ఈ దేహము భగవంతునిదే" అని అనుకొన్నప్పుడు దీనితో పాపకార్యములను ఏ మాత్రము చేయము. "నా ధనము, నా శక్తి భగవంతునివే" అనుకొనప్పుడు వాటిని దుర్వినియోగం చేయవు. సదుద్దేశముతో సత్ప్రవర్తనలో వాటిని ప్రవేశపెడతావు. కనుకనే, సత్యాసాయి సంస్థలలో Ceiling on desires అనేది ప్రవేశ పెట్టాము . .
1. Don t waste Food. Food is God. నీ శరీరము ఆహారము (food) తో ఆవిర్భవించినదే. తల్లిదండ్రులు food యొక్క స్వరూపమే నీ దేహము. అన్నం బ్రహ్మ. దానిని నీవు వ్యర్థం చేయవద్దు. నీకు ఎంత అవసరమో అంత తిను. కాని వృధా చేస్తే భగవంతుని శక్తినే వృధా చేసిన వాడవౌతావు.
2. Don t waste Money, God is wealth నీవు ధనమును waste చేయవద్దు. Misuse of Money is evil అన్నారు. సత్కార్యములు చేయి, వస్త్రదానము చేయి, శక్తి హీనులకు దానము చేయి. అంతేగాని ధనాన్ని దుర్వినియోగం చేయడం పాపమే.
3. Don t waste Time. Time waste is life waste. భగవంతుని కాలాయనమః, కాలకాలయనమః, కాలతీతాయనమః, కాల స్వరూపాయనమః అని కీరిస్తాము. అంతా కాలమే. కనుక అవసరమైన మాటలతో కాలాన్ని వ్యర్థం చేయవద్దు. కాలాన్ని వ్యర్థం చేయడమే భగవంతుని వ్యర్థం చేయడమే అవుతుంది.
4.Don t waste energy చెడ్డ ఆలోచనలు, చెడ్డచూపులు, చెడ్డతలంపులు, చెడ్డ చర్యలు - వీటన్నిటి ద్వారా నీ శరీరంలో ఉండే శక్తిని అంతా వృధా చేస్తున్నావు. కనుక, See good, Do good. Be good మంచినే చూడాలి, మంచినే చేయాలి. మంచినే వినాలి. మంచినే తలంచాలి. అప్పుడే నీ శక్తిని సద్వినియోగం చేసిన వాడవౌతావు. అదే సాధన. అదే భగవంతుని సేవ!
ఈ విధంగా చేస్తుంటే మనస్సు యొక్క ప్రభావము చచ్చిపోతుంది. మనోలయమౌతుంది. కనుక మనోతీత మైన స్థితికి పోవాలంటే, ఈ విధమైన మార్గాలలో ప్రవేశించాలి. మనస్సును దుర్లక్షణముల ఆధీనము చేసే మార్గాలలో ప్రవేశించరాదు. మనస్సును క్రమక్రమేణా మర్చిపోయే స్థితిలో మనం సాధన చేయాలి. (యు, పు. 90)
మనకు ceiling on desires లోపల నాలుగు రకములుగా బోధిస్తూ వచ్చాము. మొదటిది don t waste food ఎందుకోసము వేస్ట్ చేయకూడదు? Food is god. ఈ food నుంచి వచ్చిన ఆకారమే మన జీవితము. ఇది ఆహార మయమైన జీవితము. ఇది అన్నమయమైన జీవితము. ఇది అన్నగత ప్రాణము. ఆహారము వ్యర్థము చేసినప్పుడు మన జీవితము వ్యర్థము గావించుకున్న వారమవుతాము. ఇంక don t waste money, misuse of money is evil. ఈనాడు యువకులు అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు. ఇది దురభ్యాసము. ఇది దరుర్మార్గములో ప్రవేశింపచేస్తుంది. ఆశాంతికి గురి చేస్తుంది. సాధ్యమైనంతవరకు దీనిని తగ్గించుకోవటానికి ప్రయత్నించాలి. మన భారతదేశము ఆర్థికముగా అనేకరకములైన చిక్కులలో చేరి వుంటున్నాది. స్వార్థము అభివృద్ధి కావటంచేత ఈ ఆర్థికమైన హీనపరిస్థితి ఏర్పడింది. స్వార్థము, స్వప్రయోజనము దూరము గావించినప్పుడే మనదేశము బాగుపడుతుంది. సమిష్టి భావమును మనము పెంచుకోవాలి. జాతి సమైక్యతను పెంచుకోవాలి. దేశము యొక్క సమగ్రతను కాపాడు కోవాలి. అప్పుడే మన ఆర్థిక పరిస్థితిగాని ఆధ్యాత్మికమైన హీనపరిస్థితి గాని సరియైన స్థితిలో balance గా వుంటుంది. మన జీవిత మంతయు ఒక balance పైన ఆధారపడి ఉంటుండాది. నడచటానికి బాలెన్స్ కావాలి. కూర్చోవటానికి బాలెన్స్ కావాలి. సైకిలు తొక్కటానికి బాలెన్స్ కావాలి. కారు డ్రైవ్ చేయటానికి బాలెన్స్ కావాలి. యోచన చేయటానికి బాలెన్స్ కావాలి. Life అంతా ఒక balance. ఈ balance యీనాడు తప్పిపోయింది కారణం ఏమిటి? మితిమీరిన తెలివి పెరిగి పోయింది. నాలెడ్డి చాలా అధికమైపోయింది. ఈ knowledge: సక్రమమైన మార్గములో పెట్టాలంటే దీనిని skill చెయ్యాలి.
ఈ knowledge ని skill చేసినప్పుడే balance సక్రమంగా వుంటుంది. కాని దురదృష్టవశాత్తు యీనాటి యువకుల Knowledge ని kill చేస్తున్నారు. దానివల్లె Balance తప్పిపోయింది. దీనితో Kill చేస్తున్నారు? మన చూపులలోపల మన నాలె డ్జి అంతా వ్యర్థమైపోతున్నది. మనవినికిడి లోపల మన నాలె డ్జి వ్యర్థమై పోతున్నది. మాటల చేతను వ్యర్థమై పోతున్నది. తలపుల చేతను నాలెడ్జి వ్యర్థమై పోతున్నది. దీనికి ఒక ఉదాహరణము. ఒక రేడియో వుంటుంది. ఒక స్టేషన్ మనం పెట్టుకున్నాము. దాని వాల్యూము పెద్దగా పెట్టుకో వచ్చును. చిన్నగా పెట్టుకోవచ్చును. దానిని start చేసి పెట్టావంటె. నీవు విను వినకపో, అది పెద్ద శబ్దముగా పెట్టు, చిన్న శబ్ధముగా పెట్టు, ఎన్నియో యూనిట్లు కరెంటు వ్యర్థమవుతున్నది. అదే విధముగా మన దేహము ఒక రేడియో వంటిది. మనము నిరంతరము యోచన చేస్తున్నాము. మాట్లాడుతున్నాము. గట్టిగా మాట్లాడు తున్నాము; తనలో తాను మాట్లాడుతున్నాము. నిద్రలో మాట్లాడుతున్నాము; నిద్ర వచ్చేంతవరకు మాట్లాడు తున్నాము. తెల్లవారి లేచిన మొదలు మనలో మన మాటలు జరుగుతూ వుంటున్నాయి. తద్వారా ఎంత ఎనర్జీగా మారిపోతుంది. జీవితము కనుక యీ దేహము నందుండిన శక్తిని సద్వినియోగపరచుకోవటానికి తగిన కృషి చేయాలి. అప్పుడే మనకు చక్కని బాలెన్స్ ఏర్పడుతుంది. (బృత్ర.పు.33/34)