మనోతీతమైన స్థితి

దేహము భగవంతునిదే" అని అనుకొన్నప్పుడు దీనితో పాప కార్యములను ఏమాత్రం చేయము. *నాధనము, నాశక్తి భగవంతునివే" అనుకొన్నప్పుడు వాటిని దుర్వినియోగం చేయవు. సదుద్దేశముతో, సత్ప్రవర్తనలో వాటిని ప్రవేశపెడతావు. కనుకనే, సత్యసాయి సంస్థలలో Ceiling on Desires అనేది ప్రేవకి పెట్టాము .

 

1) Don’t waste, food is God. నీ శరీరము ఆహారము (food) తో ఆవిర్భవించినదే. తల్లిదండ్రుల food యొక్క స్వరూపమే నీ దేహము. అన్నం బ్రహ్మ. food is God. దానిని నీవు Waste (వ్యర్ధం) చేయవద్దు. నీకు ఎంత అవసరమో అంత తిను. కాని, వృధా చేస్తే భగవంతుని శక్తినే వృధా చేసిన వాడవైతావు.

2) Don t waste Money. God is Wealth.నీవు ధనమును Waste చేయవద్దు. Misuse of Money is Evil అన్నారు. సత్కార్యములు చేయి, అన్నదానము చేయి, గృహదానము చేయి, వస్త్ర దానము చేయి. శక్తి హీనులకు దానము చేయి. అంతేగాని, ధనాన్ని దుర్వినియోగం చేయడం పాపమే.

3) Don t waste time, time waste is life waste భగవంతుని "కాలాయనమః కాలా కాలాయనమః కాలా తీశాయనమః కాల స్వరూపాయనమ:" అని కీర్తిస్తాము. అంతా కాలమే. కనుక, అనవసరమైన మాటలతో కాలాన్ని వ్యర్థం చేయవద్దు. కాలాన్ని వ్యర్థం చేయడం భగవంతుని వ్యర్థం చేయడమౌతుంది.

4) Don t waste Energy చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ చర్యలు - వీటన్నింటి ద్వారా నిశరీరంలో ఉండే శక్తిని అంతా వృధా చేస్తున్నావు. కనుక, మంచినే చూడాలి. మంచినే వినాలి. మంచినే చేయాలి. మంచినే తలంచాలి. అప్పుడే నీ శక్తిని సద్వినియోగం చేసిన వాడవౌతావు. అదే సాధన. అదే భగవంతుని సేవ విధంగా చేస్తుంటే మనస్సు యొక్క ప్రభావము చచ్చిపోతుంది: మనోలయ మౌతుంది. కనుక, మనోతీతమైన స్థితికి పోవాలంటే విధమైన మార్గాలలో ప్రవేశించాలి. మనస్సును దుర్లక్షణముల ఆధీనం చేసే మార్గాలలో ప్రవేశించరాదు. మనస్సును క్రమక్రమేణా మర్చిపోయే స్థితిలో మనం సాధన చేయాలి.

(. సా..93 పు. 223)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage