మీరు వాచ్ (Watch) వేసుకున్నారు. ఇది అయిదు అక్షరములలో ఉంటున్నది. దీనిని మీరు గంటలు మాత్రమే చూచి,
అలంకారంగా పెట్టుకోటంకాదు.
"ఎడమచేతికడాన రెండు తుంటలవిల్లు
తోలు పెట్టగ గట్టి యాలాడ గడతారు
వీటి యేషాలప్ప ఇవి
ఇవి కంటితో చూచేటి కానియవతారాలు"
ఇది కేవలము ఆలంకారము కోసం కట్టుకోటం కాదు. అలంకారంతోపాటు మన గుణములను కూడా పోషించుకోటానికి ప్రయత్నం చేయాలి. గడియారము కూడను, ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని సూచిస్తూ వస్తుండాది. మనము దీనిని మొట్టమొదట పంచప్రాణములుగా భావించాలి. ఇది పంచాక్షరములతో ప్రబోధ చేసేటటువంటి పవిత్రమైన మంత్రంగా ఉంటుండాది.
దీని మొదటి లెటరు (letter) W
W = Word - "Watch your word".
నీ యిష్టమొచ్చినట్లు నీవు వాగొద్దు నీవు చెప్పేటటువంటి ప్రతిపదమును కూడను వాచ్ (Watch) చెయ్యి. ఇంక రెండవది A
A - Action Watch your action"
నీ ప్రవర్తనను సరియైన హద్దులోపల పెట్టుకొని సక్రమమైన మార్గంలో దింపడానికి చూచుకోవాలి.
ఇంక మూడవది T
"T= Thought Watch-your thought"
నీయొక్క ఆలోచనను మంచి మార్గంలో వుంచుకోవాలి.
ఇంక నాల్గవది C
C-Character. Watch your character." ని యొక్క శీలమును కాపాడుకో,
ఇంక ఐదవది. H
H = Heart- Watch your heart “
నీ యొక్క హృదయమును పరిశుద్ధముగా ఉంచుకో, పంచ ప్రాణములైన ఈ పంచాక్షరములను మీరు సక్రమముగా పాటించితే, పరమాత్మ మీకు అక్కడే ప్రత్యక్షమవుతాడు. ఈ అయిదింటిని విచ్చలవిడిగా బజారు వెంట విడిచి పెట్టి, ఏదో మృగలక్షణంగా, లేక మృగువర్తనలో సంచరిస్తే నిజంగా వారిని మానవులని చెప్పడానికి వీలుకాదు. కనుకనే, మానవ ధర్మమునెరిగినటువంటి వారిని మానవునిగ విశ్వసించి, రాముడు అతనిని శిక్షించడానికి ప్రయత్నించాడు. కనుక, మనము ఆకారమును ప్రధానముగా భావించకూడదు. అందులో ఉన్నటువంటి ఆత్మతత్వమును ప్రధానంగా తీసుకోవాలి.
(ఆ.రాపు 93/94)