వర్తమానము

ఇంద్రియాలు "ఎందుకీ పెనగులాట? వీలున్నంత వరకూ హాయిగా తినండి త్రాగండి" అంటాయి. గురువు ఆంటాడు. "చెప్పకుండా ఎప్పుడో మృత్యువు మీద విరుచుకు పడుతుంది. ఆక్షణం రాకముంచే మృత్యుభీతి తొలగించు కోండి" వర్తమానమే నమ్మదగిన మిత్రడు. నిన్నటిదినం  నిన్ను  దగా చేసి వెళ్లిపోయింది. భవిష్యత్తు అనేది వస్తాడో రాడో తెలియని అతిథి. ఈనాడే గట్టి స్నేహితుడు. కనక గట్టిగా పట్టుకోండి.

(వ.1963 పు.83)

 

బుద్ధుడు ధర్మ ప్రచార నిమిత్తం దేశసంచారం సల్పుతున్న సమయంలో ఒకనాడు బాగా అలసిపోయినాడు. ఒకగ్రామం చేరిన తరువాత తన శిష్యులలో ప్రధానుడైనవానిని పిలిచి "నాయనా! నేను బాగా అలసిపోయినాను. కాబట్టి, ఈనాడు నీవే ప్రజలకు చక్కని ఆధ్యాత్మిక బోధ సల్పి వారిని ఆనందపరచు. నేను కొంత విశ్రాంతి తీసుకుంటాను" అని పలికి లోపలికి వెళ్ళాడు. ఆ శిష్యుడు ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తూ, "బుద్ధుడు ప్రేమమయుడు, జ్ఞానయోగి. ఇలాంటి మహనీయుడు ఇంతకుముందు పుట్టలేదు, ఇకముందు పుట్టబోడు" అని చెప్పేటప్పటికి అక్కడ చేరిన భక్తులందరూ హర్షామోదాలను వ్యక్తం చేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టారు. లోపల విశ్రాంతి తీసుకుంటున్న బుద్ధుడు తక్షణమే బయటికి వచ్చాడు. మాట్లాడుతున్న శిష్యుణ్ణి ఆపాడు. "నాయనా! నీ వయస్సెంత?" అని అడిగాడు. ఆ శిష్యుడు "స్వామీ! నాకు 25 సంవత్సరములు" అన్నాడు. "నీవు ఏఏ దేశాలను సందర్శించావు?" "స్వామీ! కురు, పాంచాల దేశాలను సందర్శించాను" అన్నాడు. అప్పుడు బుద్ధుడు "నాయనా! నీ వయస్సు 25 సంవత్సరాలు మాత్రమే. కేవలం రెండు దేశాలను మాత్రమే చూశావు. అలాంటప్పుడు నీవు బుద్ధుని వంటిమహనీయుడు ఇంతవరకు ఎక్కడా పుట్టలేదు. ఇకముందు పుట్టబోడు అని ఎలా చెప్పగల్గుతున్నావు? వర్తమానం గురించికూడా పూర్తిగా తెలియని వాడవు గతమును గూర్చి, భవిష్యత్తును గూర్చి ఏరీతిగా చెప్పగలవు? ఇది కేవలం అజ్ఞానమే. ఇంతకు పూర్వం ఎందరో మహానీయులు పుట్టినారు. ఇక ముందు కూడా ఎందరో పుట్టబోతున్నారు. కాబట్టి, పుట్టలేదు. పుట్టబోరు అని చెప్పటానికి నీకు అధికారం లేదు. ఇకపై ఈ విధంగా ప్రసంగించవద్దు" అని మందలించాడు.

(స.. సా. ఆ. 200 పు 307/308)

 

దేహము ఆరోగ్యముగా పుష్టిగా సంతుష్టిగా నుండినప్పుడేమన బాలెన్స్ సరైన స్థితిలో అనుభవించవచ్చు. గడచిన దానికి మీరు ఏమాత్రము చింతించనక్కరలేదు. Past is Past, forget the past. నడచుకొని వచ్చిన రోడ్డు చూచుకొని వచ్చాము కదా. ఇంక వెనుకకు ఎందుకు చూడాలి. ఎన్నిలక్షలు ఖర్చు పెట్టినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి ఒక సెకండైనా ఒక యించైనా ముందుకు రాదు. ఆలాంటి దానినిమిత్తమై మనము ఎందుకు యోచన చేయాలి? ఇంక భవిష్యత్తు, భవిష్యత్తు మనకు తెలియనిది, అగాధమైనది. రేపు రేపు అనే భావన చేసినప్పుడు రేపటి వరకు మనము వుండేది ఏమినమ్మకము? నమ్మకము లేనిదాని నిమిత్తమై మనము ఎందుకు యోచన చెయ్యాలి? future is not sure. కానటువంటి దానికి   insure చేయటం ఎందుకు? ఈ రెండు రకములైన చింతలచేతనే మనజీవితము వ్యర్థమైపోతుండాది. ఈనాటి మానవుడుయువకుడు దుఃఖమునకు గురికావటము, విచారమునకు గురికావటము, అనారోగ్యమునకు గురికావటము, కారణమేమిటి? ఉన్నదానితో తృప్తిపడక లేని దానికిఅవస్థలు పడుతున్నాడు. అందువల్లనే ఆశాంతికి గురి ఔతున్నాడు. విద్యార్ధులారా! గతము గతము. భవిష్యత్తుభవిష్యత్తు. ఈ రెండింటిని మనము విచారణ చేయనక్కరలేదు. వర్తమానము Present చాలా ప్రధానమైనది. this is not ordinary present. This is omnipresent అనగా భవిష్యత్తు ఫలితము ఈ Present లోవుంటున్నది past యొక్క ఫలితము ఈ Present లో వుంటున్నాది. ముందు ఏవిత్తనము నాటామో ఆ మొక్క ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు యేమొక్కను నాటుతామో ఆఫలమే ముందుకు అనుభవిస్తాము. Future and past రెండు కూడను Present లో వుంటున్నాయి. వర్తమానమును సక్రమమైన మార్గములో ఆనుభవించండి. ఎట్టి విచారములకును అవకాశమునందించకండి. ఈ సక్రమమైన మార్గము అనుసరించినప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జీవితముగా రూపొందుతుంది. అమృతమయమైన జీవితముగా రూపొందుతుంది. అమరత్వము పొందుతుంది. మానవత్వము సార్ధకము గావిస్తుంది.

(బృ.  త్ర. పు 34/35)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage