దేహమును ఒక పనిముట్టుగా విశ్వసించి మనము ధరించిన వస్త్రముగా స్వీకరించి యీ వస్త్రములో చేరిన మాలిన్యమును అప్పుడప్పుడు పరిశుద్ధము గావించుకోవటానికి తగిన కృషి చేయాలి.
వస్త్రము శుభ్రము చేయాలంటే చాకలి వేయాలి. నీ హృదయము పరిశుద్ధము కావాలంటే భగవంతునికే అప్ప చెప్పాలి. మరొకరు శుభ్రము చేయలేరు. ఈ దేహము సత్కర్మల చేత సార్థకమవుతుంది. ఇది ధరించిన వస్త్రము వంటిదే. దేహము ఒక ఉపాధి. దేహమే నీవు కాదు. నేను కాని దేహమును నేనుగా భావించుటమే అజ్ఞానము. ఈ అజ్ఞానమును నిర్మూలము గావించు కున్నప్పుడే నీవు జ్ఞాన బాస్కరుడుగా ప్రకాశిస్తావు.
(బర్ర.పు.24/25)