మనసు ఎట్లు పారిపోతే అట్లు పారిపోనీ; నీవు మాత్రము దాని వెంట ఎక్కడకు పోతుందా అని చూచుకుంటూ పోవద్దు. నీవు ఉన్నచోటే ఉండు. మనసు ఇష్టమొచ్చినట్లుతిరిగి తిరిగి కడకు అలసి నీ చెంతకే వచ్చును. మనసు ఏమియు తెలియని పసిబిడ్డ వంటిది. తల్లి పిల్చే కొలదీ తానుకూడను దూరముగా పోవుచునే యుండును, అట్లుగాక, ఆ బిడ్డవైపు చూడక, తల్లిపాటికి తల్లి వెనుకకు తిరిగిన, బిడ్డ తనపాటికి తానే పరుగెత్తుకొని తల్లి చెంతకు వచ్చి చేరును. నీ నియమము ప్రకారం నీ ఇష్ట నామ ధ్యానములను ఏకాగ్రత ఫలించును. నీవునూ సఫల మనోరథుడవౌదువు. నీవు నీ మనసులోనికి చేరనివ్వవద్దు. ప్రపంచమున అశుచి పదార్థమంటూ లేనేలేదు. సర్వాంతర్యామిగా పరమాత్ముడు ఉన్నప్పుడు అశుచి ఎక్కడిది? బాహ్య దృశ్యమునకూ, అనుభవమునకూ అశుచి అనుకున్ననూదానికి పరమాత్మ నామము సోకగానే శుచిగా మారును.
(జ.పు.123/124)
(చూ: ఆన పేక్ష, మనస్సు)