కృతయుగములో శ్రీమన్నారాయణుడు వామనావతారము తీసుకొని బలిచక్రవర్తిని సరియైన మార్గములో పెట్టే నిమిత్తమై దానము అడగటానికి వెళ్లాడు. బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు. ఆచార్య ఆచరించినవాడు. అనేక వేల మందికి గురువు ఆచార్యాడు. బలిచక్రవర్తి వామనుడు నారాయణుడని తెలుసుకొని అతనికి సర్వము అర్పించుటకు సిద్ధమయ్యాడు. ఇస్తాను అని మాట ఇచ్చాడు. శుక్రాచార్యుడు వద్దు వద్దు. నీవు చాలామోసపోతావు. రాజ్యమంతా భ్రష్టయిపోతుంది. నీవు అతనికి ఏ మాత్రము మూడడుగులు దానము ఈయవద్దన్నాడు. ఆ సమయంలో దైవము కంటే గురువు ఏమిటని ధిక్కరించి పలికి బొంకుట కన్న పాపమున్నె ఏమైనా సరే, గురువు శపించినా ఫరవాలేదు. నేను భగవంతునికి అర్పితము చేస్తానన్నాడు. దైవమునకు అర్పితము చేస్తుంటే వద్దని చెప్పేవాడు గురువా?!
ద్వాపర యుగంలో పాండవులకు అన్ని రకములైన విద్యలు - బోధించుటకు ఏకైక గురువుగా వచ్చాడు. ద్రోణాచార్యుడు, ద్రోణాచార్యుడు ప్రామిస్ చేశాడు. నీకు తప్ప మరొకరికి గురువుగా ఉండను. నా శక్తి అంతా నీకే ఆర్పితము చేస్తాను. కానీ మరొకరికి చేయను. ఆ ధైర్యము చేతఅర్జునుడు విఱ్ఱ వీగిపోయాడు. అన్ని విద్యలు నేర్పాడు.ద్రోణుడు చెప్పినట్టుగా ఎవరికి గురువుగా పోలేదు. ఒకానొక సమయంలో ఏకలవ్యుడు వచ్చి స్వామీ, నాకు విద్య నేర్పమని ప్రార్థించాడు. నేను ఆర్జునునికి ప్రామిస్ చేశాను. అర్జునునికి తప్ప మరొకరికి గురువుకాను. అన్నాడు. మంచిదే అంతవరకు సంతోషమే. పాండవులు, కౌరవులు అరణ్యమునకు వెళ్ళారు. విహారార్ధమై వారి వెంట కుక్కలను తీసుకు వెళ్లారు. ఒక మృగమును చూచి కుక్క అరిచింది. ఆ అరుపును విని ఎక్కడనుందో నాలుగైదు అంబులు వచ్చాయి. ఐదు ఒక్కతూరి పడ్డాయి. అర్జునుడు చాలా ఆశ్యర్యపోయాడు. శబ్దమును పురస్కరించుకొని అన్ని అంబులు వేసిన గొప్ప విద్యావంతుడు ఎవరాయని అరణ్యములో వెతుకుతూ పోయారు. గొప్ప శక్తివంతుడగా ఉంటున్నాడు. ఈ శక్తి నాకు కూడా లేదే. తనకు లేక పరులకు శక్తి ఉండినప్పుడు అసూయ వస్తుంది. వెతికేటప్పటికి ఒక పూరి గుడిసె లోపల ఒక బోయవాడు ఒక అంబుని పట్టుకు నిల్చున్నాడు. అతనిని చూచారు. నీవేనా వానిని వదలినదని అడిగాడు. అవును అన్నాడు. నీకు ఎవరు గురువు అని అడిగాడు. ద్రోణాచార్యుని ప్రార్థించాడు. ద్రోణుడు ఒప్పుకోపోవటంచేతద్రోణాచార్యుని పాదములనే గురువుగా భావించి యీ విద్యలు నేర్చుకున్నాడు. అతనికి తెలియకుండాద్రోణాచార్యుడే నా గురువు అన్నాడు. అర్జునుడు మండిపోయాడు. నాకొక వైపున ప్రామిస్ చేసి తిరిగి యీ వ్యక్తికి యిన్ని విద్యలు నేర్పినాడని చాలా కోపంగా యింటికి వెళ్ళాడు. ద్రోణాచార్యుని అడిగాడు. ద్రోణాచార్యుడు సత్యమే చెప్పాడు. నేను ఎవరికి గురువుకాదు. నేను ఏకలవ్యునికి గురువుకాదు. నా దగ్గరకు వచ్చి ప్రార్థించాడు. గాని నేను అంగీకరించలేదన్నాడు. ఇది సత్యమే. కానీ అర్జునుడు చాలా మండిపడ్డాడు. నాకంటె గొప్పవాడు ఉన్నాడు. ఈ లోకంలో, పెద్ద ఆసూయ. అతని శక్తిని ఎట్లాగైనా నిర్మూలం గావించాలని సంకల్పం గావించుకున్నాడు. నాకంటె అధికుడు యీ లోకంలోఉండ కూడదు. కాబట్టి దీనికి తగిన ప్రయత్నం చేయమన్నాడు ద్రోణాచార్యుని. ద్రోణాచార్యుడు విధిలేక, ఈ గొప్పదనము చూచి లోంగిపోయాడు ద్రోణాచార్యుడు. రాజుకు విరుద్ధంగా పోతే నాగతి ఏమవుతుందోనని భయపడ్డాడు. స్వార్థమైన బుద్ధిలో కుయుక్తి పన్ని అడవియందు నివసించే ఏకలవ్వుని దగ్గరకు పోయి ఏకలవ్యా! నీకు ఎవరు గురువు" అడిగాడు. "నీవే గురువు అని చెప్పాడు. ఎంతో గౌరవముగా చెప్పాడు. ఇతను గురువు కాకపోయినప్పటికి, మానసికంగా నీవే నా గురువు " అన్నాడు. అయితే గురుదక్షిణ ఏమిస్తావు అన్నాడు. ఏది అడిగితే అది యిస్తానన్నాడు. అన్నింటికి సిద్ధమే వాడు. ఎందుకంటే, గురువుపై విశ్వాసము అట్టిది. అంత విశ్వాసముగా ఉండినవానికి గురువు చాలా ద్రోహము చేశాడు.
దక్షిణాంగుష్ఠ మిచ్చిన దానచేసి
బాణసంధాన లాఘవ భంగమయ్యె
విలువిద్య కలిమికి హీనుడయ్యె
పార్థుని మనోరథము ఈడేరనంత!
అర్జునుని మనస్సు తృప్తిపరచే నిమిత్తమై ఏకలవ్యుని దక్షిణ అంగుష్టమును దక్షిణగా కోరాడు. ఇది గురువు చేసే పనియా! కాదుకాదు. ఇలాంటి ప్రాపంచిక గురువులు స్వార్థమునకు, స్వప్రయోజనమునకు వినియోగించుకుని నిజమైన ఆత్మజ్ఞానమునకు దూరము గావిస్తున్నారు. వీరందరు వ్యావహారిక గురువులేగానీ ఆ త్మ సంబంధమైన గురువులు కాదు. ఎవరితోనైనా విద్యను నేర్చుకో తప్పులేదు. కానీ అర్పితము మాత్రము భగవంతునికి మాత్రమే కావాలి. అదే నిజమైన భక్తి. అదే నిజమైన ఆధ్యాత్మికము.
(శ్రీ స.పు.82/84)