మానవులకు కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి - ధర్మమును అనుసరించి ఆశ్రయించి జీవించుట ఆయన బాధ్యత, ఏది పవిత్రత, ఏది ధీరత్వము, ఏది సమ్మతము అదే ధర్మము."ధారయతీతి ధర్మః" మానవ సముదాయమును నిలబెట్టుట మానవధర్మము. ఈ బాధ్యతను సంతృప్తిగా నెరవేర్చుటకు సాధన అనే సామగ్రి అత్యవసరము. అదే అన్నిటికీ మూలాధారము. స్వార్ణభావము దూరముచేసుకొని, పరులకు ఉపకార మందించే బుద్ధిని పెంచుకొనేది కూడ ఒక పెద్ద సాధన, పరులను ఆనందపరచి, ఆహ్లాదపరచే కర్మల నాచరించాలి. అట్టి వ్యక్తిత్వమునకే శిష్టులు అని పేరు సార్థకనామగును.
(ఆ.పు. 20/21)