శివయేవ సదా జీవం జీవ యేవ సదా శివం
వేద్వైక్య మునయో ర్యస్త స్యాత్మజ్ఞావ చేత సః
ప్రేమస్వరూపులారా! శివుడే జీవుడు. జీవుడే శివుడు అన్న ఏకాత్మ తత్త్వాన్ని ఎవరు గుర్తింతురో వారే పరిపూర్ణ జ్ఞాని. కారణం విశ్వమంతకు ఒకే విభుడు. ఇట్టి సత్యమును గుర్తించిన వ్యక్తి దానిని ఆద్వైత దర్శనం జ్ఞానం అన్నాడు. అయితే జీవగుణముతో బాటు శివ గుణము కూడా లీనమై ఉంటున్నది. జీవగుణము మనస్సు, “మనోమూలమిదం జగత్", జగత్తంతయు మనస్సు యొక్క కారణమే. మనస్సంటే ఏమిటి? "సంకల్ప వికల్పకాత్మకం మనః" నిరంతరము మననం చేయటమే మనస్సు యొక్క స్వరూపము. సంకల్పవికల్పయులచే తన స్వరూపము నిరూపిస్తూ వచ్చింది. ఇట్టి సంకల్ప వికల్పములకు విరామ మనేదే లేదు. విరామము లేక నిర్విరామముగా సంకల్ప వికల్పము జరుగుతుంటాయి. అయితే ఇట్టి సంకల్పములు ఒకొక్కసారి పరిధి తప్ప వేగ స్లితిని పొంది మానవత్వమును అవ్యక్తము చేస్తుంది. ఈ మనో వేగమును భరించుకొన లేక మానవుడు అస్తవ్యస్తమై పోతున్నాడు.
(ద.స.స.97పు. 43/44)
అంతర్బహిర్ తత్త్యములందు, స్వరూప స్వభావములందు, ప్రత్యక్ష అప్రత్యక్ష తత్త్యములందు దైవత్వమనే శక్తి వ్యాపించి యున్నదనే సత్యాన్ని వారు (ఋషులు) విశ్వసించేవారు. తదుపరి దీని అంతరార్థాన్ని విపులంగా జగత్తులో వ్యాపింప చేసే నిమిత్తమై మహర్షులు తపస్సులు ఆచరించారు. వేదాహమేతం! పరుషం మహాతం: ఆదిత్యవర్గం తమస: పరస్తాత్: అంధకారమనే చీకటి ఆవలనున్న తేజోమయుడైన పరమాత్మను మేము చూచాము. జనులారా! మీరు కూడా చూచి తరించండి. అని ప్రబోధించారు. మంగళస్వరూపుడు, గుణరహితుడు కనక అతనికి “ శివ:" అని క్రొత్త పేరు పెట్టారు . శివ: అనగాత్రైగుణ్యరహితుడు. అనగా త్రిగుణములు లేనివాడు. కనుక సదా పరిశుద్ధుడు ఆ శుద్ధమును కల్పించేవి గుణములే. భగవంతునికి గుణములు లేవు కనుక అతడు పరిశుద్ధుడు. నిర్గుణుడు. ఇలాంటి తత్యానికి "శివః" అని క్రొత్త పేరు పెట్టారు .
(సా.పు.631)
మానవుడు శివం గాని శవం కాదు. (శివం = శివుడు) - మానవునికి మూడు నేత్రములున్నవి. అవి సూర్య చంద్రాగ్నులనుండి వచ్చినవి. అగ్నినేత్రము = అంతర్నేత్రము. అది యోగశక్తి చేత మాత్రమే తెరువబడును. త్రినేత్రుడైన శివుడు భూత భవిష్యద్వర్తమానములు మూడుము చూడగలడు.
(స.వ.1995 పు. 16/17)
(చూ॥ ఒకరే, శంకరుడు, హిరణ్యగర్భతత్త్వం)