భావనలు/భావములు/భావాలు

మన భావములను పురస్కరించు కొనియే, మన ప్రవర్తన కొసాగుతూ వస్తుంది. "యద్భావం - తద్భవతి". మన హృదయము పవిత్రమైనది. ఇందులో ఏ విధమైన అభ్యాసములను, తలంపులను మనము ప్రవేశ పెడుదుమో వాని ప్రభావమే ఈ హృదయం పొందుతుంది.

Sow an action - reap a tendency

Sow a tendency - reap a habit

Sow a habit - reap a character

Sow a character - reap a destiny

You are the master of your destiny

You can do or undo.

 

కొన్ని సమయములలో -Emotional excitementఉంటున్నది. అది కొంచెం చల్లార్చు కోవాలి. దీనిని మీరు Control చేసుకుంటే ఎంతో ఆదర్శ జీవులుగా ఉంటారు. మాటలు తగ్గించుకోండి - కొంత వరకు సత్యాన్ని గుర్తించండి - పవిత్రత పెంచుకోండి జీవితమును ఆనందంగా జీవించండి.

 

జీవితములో ఏదీ Happy గా లేదు. అప్పటి కప్పుడు వస్తుంది. అప్పటి కప్పుడు పోతుంది. అంతా Passing clouds. Permanent Happiness ఒక్క దైవత్వములో మాత్రమే ఉంటున్నది. ఇది Heart to Heart - Love to Love ఇదే మీరు పెంచుకోవాలి. ఇదియే నిజమైన భక్తి ప్రపత్తులకు నిదర్శనము.

(దే.యు.పు.110)

 

భగవంతునికి ఒకరి పట్ల ఇష్టము, మరొకరి పట్ల ద్వేషము అనేది లేదు. అయితే, ఎవరి భావములకు తగిన ఫలితం వారికి లభిస్తుంది. ఒక పర్యాయం పురందరదాసు చెప్పాడు - "కృష్ణా! నీవు కంసునికి యముడిగా కనిపించావు. అతని తండ్రికి దేవునిగా గోచరించావు. హిరణ్యకశిపునికి యముడుగా కనిపించావు. అతని కుమారుడైన ప్రహ్లాదునికి దేవునిగా గోచరించావు. రావణునికి యమునిగా కనిపించావు. ఆతని తమ్ముడైన విభీషణునికి రామునిగా కనిపించావు", రాముడు యముడు ప్రత్యేకంగా లేరు. అయితే, వారివారి భావములను పురస్కరించుకొని ఒకరికి రామునిగాను, మరొకరికి యమునిగాను గోచరించాడు.

 

చిత్రంబులు త్రైలోక్యప

విత్రంబులు భవలతాల చిత్రంబులు స

న్మిత్రంబులు ముని జన వన

చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్

 

భగవంతుని చిత్రములు వర్ణించుటకు వీలుకానివి. కవులు తమకు తోచినట్లుగా వర్ణించవచ్చునుగాని, ఆ వర్ణన సరియైనది కాదు. ఈ కలియుగంలో మానవుడు ప్లాస్టిక్తో కమలాలను, ద్రాక్షగుత్తులను సృష్టిస్తున్నాడు. కాని, ఆ కమలాలపై తుమ్మెదలు వాలుతున్నాయా? లేదే. భగవంతుడు సృష్టించిన కమలాల పైనే తుమ్మెదలు వాలుతాయి. ఎందుకంటే, భగవంతుని సృష్టి మధుర మైనది. పురందరదాసు మరొక పర్యాయం చెప్పాడు"భగవంతుడా! కొండ మధ్యలో చెట్టును ఎవరు సృష్టించారు? దానికి ఎవరు నీరు పోశారు? ఎవరు ఎరువు వేశారు? నెమలికి ఇన్ని రకములైన రంగులు ఎవరు వేశారు? పచ్చని చిలుకకు ఎఱ్ఱని ముక్కు ఎవరు పెట్టారు? ఈ ప్రపంచంలో కనిపించే రకరకాల పుష్పాలకు ఇన్ని రంగులు ఎవరు వేశారు? ఈ చిత్రమంతా నీదేగాని, మరొకరిది కాదు. ఈ సృష్టి అంతయు నీ సంకల్పములోనే ఇమిడి యున్నది."

(స.సా.న..99పు.304)

 

మీ భావాలు మధురంగా వుండాలి. వాటికి తగిన మాధుర్యం మీ భాషణలో వుండాలి. ఇరులకు ప్రియంగావుండటం కోసం అసత్యమూ అతిశయోక్తులూ పలకవద్దు, ప్రతిదాన్ని పరుషంగా విమర్శించే అప్రతిష్ఠ ఫాలుచేసే మనస్తత్వం చాలా చెడ్డది. అలాగే సత్యపు సరిహద్దులు దాటి పోయి గోరంతలు కొండంతలుచేసి స్తోత్రాలు చెయ్యటం కూడా చెడ్డ పద్ధతే.

(1963 పు.63)

 

ముండే ముందే మతిర్భన్నః అన్నట్లు ఎవరి భావాలు వారివి. భిన్నత్వము సహజము. ప్రతివానికి తన భావమే సరియైనదని, ప్రత్యేకమైనదని, ప్రధానమైనదని తోస్తుంది. ఇది సాధారణం. సమరస భావంతోను, సమన్వయధోరణితోను సమైక్యతను సాధించాలి. ఒక చిన్న ఉదాహరణ: ఒక పర్యాయం చేతి వేళ్ళు తమలో ఎవరు గొప్ప? అని వాదించుకున్నాయి. ముందుగా చిటికెనవ్రేలు అంటున్నది - "చూడండి, ఎవరికైనా నమస్కరించేటప్పుడు నేను ముందుంటాను. కాబట్టి. నేనే గొప్ప" దాని ప్రక్క వేలు చెప్పింది - "నేను ఉంగరపువ్రేలును. అత్యంత విలువైన ఉంగరాలను నాకే ధరింపజేస్తారు. కనుక, నేనే ప్రధానం". మధ్య వ్రేలు అంటున్నది - "నా చేతికి కూడా ఉంగరాన్ని తగిలించవచ్చు. ఇందులో ప్రత్యేకత ఏముంది? మీ అందరికంటే నేనే పొడువు. కాబట్టి, నేనే ముఖ్యం" అన్నది. ఇంక చూపుడుఎలు చెపుతున్నది - "చూడండి, ఎవరికైనా బుద్ధి చెప్పాలన్నా, ఎవరినైనా హెచ్చరించాలన్నా, ఏ వైపునకైనా సూచించాలన్నా నేనే కావలసి వస్తుంది. కాబట్టి, నేనే ముఖ్యంగా, చివరికి బొటన వ్రేలు మీరు నల్గురూ మూర్ఖంగా వాదిస్తున్నారు. ఒక విషయం ఆలోచించండి. నేను మీలో కలవనిదే మీరు ఏ పని చేయలేరు. కనుక, మీ అందరికంటే నేనే ముఖ్యం" అన్నది. నేటి మీ ధోరణులు, ఆలోచనలు కూడా ఈ రీతిగానే ఉంటున్నాయి. కలసి పని చేయాలి. ఎవ్వరూ ఆధిక్యతను ప్రకటించుకోరాదు. దీనివల్ల సమాజంలో ప్రేమ మరుగై ద్వేషాలు, తగాదాలు పెరిగి అలజడి ప్రారంభమవుతుంది. చేతి వేళ్ళు కలసికట్టుగా పని చేయకపోతే మనం ఏ కార్యమూ సాధించలేము కదా!అదేవిధంగా, వ్యక్తుల మధ్య సమన్వయం, సహకారం లోపిస్తే సమాజం అభివృద్ధి చెందదు.

(స.సా.జ..2000పు.28/29)

(చూ॥ దుర్గుణములు, భద్రము)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage