బుద్ధునికోసం అనేకమంది రాజులు పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టిస్తూ వచ్చారు. కానీ, బుద్ధుడు వాటిని ఆశించలేదు. ఒక ముదుసలి తల్లి పవిత్ర మైన హృదయంతో ఒకదమ్మిడి నివ్వగా దానిని రెండు చేతులతో స్వీకరించి ఒక బట్టలో మూట కట్టుకొని తన దగ్గర పెట్టుకున్నాడు. కట్టకడపటికి ప్రాణం విడిచే సమయంలో అతనిదగ్గర ఆ దమ్మిడీ మాత్రమే ఉంది. ఆడంబరంతో ఇచ్చినది కాదు గొప్పది; ప్రేమతో, వినయంతో, పవిత్రమైన హృదయంతో ఒక్క నయాపైస ఇచ్చినా అదే గొప్పది. Why barrels of donkey s milk? One teaspoonful of cow milk is useful.
(స.పా.ఆ.2000పు.309)