భార్యా భర్తా పక్కపక్కన నదిలో కొట్టుకొని పోతున్న రెండు కర్ర ముక్కల లాంటివారు. కాసేపు రెండు ముక్కలూ పరస్పరం కలసి పోతుంటాయి. ఇంతలో నదీ ప్రవాహం వాటిని విడదీస్తుంది. మళ్ళీ కాసేపటికి కలుస్తుంటాయి. రెండూ సముద్రంలోకి నదితోపాటు కొట్టుకొనిపోయేవే. కాస్తముందో, వెనుకో, అంతే! అందుకే అవి విడిపోతే విచారించాల్సిన పనిలేదు. అది సహజంగా జరిగే సంగతే!
(శ్రీసా.గీ.పూ.40)