భార్య పతివ్రత ఐతే భర్తకు గండాలు తప్పుతాయి.
(త్రి. (సా.పు.223)
తల్లి తండ్రి తోబుట్టు కొడుకు కోడలు మొదలయిన వారందరూ వారు వారు చేసుకొన్న పుణ్యపాపములను బట్టి శుభాశుభముల ననుభవింతురు. భార్య ఒక్కతే భర్త అనుభవించే శుభాశుభములలో భాగమును వహించును.
(రా.వా.మొ.పు.235)
"భర్త ఎంత చెడ్డ వాడైనప్పటికీ , ఎంత నీచంగా ప్రవర్తించినప్పటికి , భార్య ప్రేమతో అతనినిదారికి తెచ్చి సరిదిద్ది , భగవంతుని ఆశీస్సులు పొందేటట్లు చేయాలి" (పిల్లల పెంపకం రీటా బ్రూస్ పు95)