ఆస్తి పాస్తులను కూడా తగలబెట్టి డిగ్రీ అనేటువంటి భిక్షా పాత్రను చేతబట్టి గడప గడపకు వెళ్ళి ఉద్యోగము, ఉద్యోగము అనే భిక్షను ఆశించే టటువంటి విద్యకాదు మన భారతీయ విద్య. తన స్వశక్తిపై స్వతంత్రముగా నిలచేటట్లు చేసేటటువంటిదే భారతీయ విద్య, అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములను యెదుర్కొనేటువంటి మనోధైర్యంమును,ఆత్మ స్థైర్యమును అందించేది భారతీయ విద్య. నిజముగా భారతీయ విద్యయొక్క తత్వమును భారతీయులే గుర్తించలేనటువంటి పరిస్థితి ఏర్పడుచున్నది. మానవత్వములో నున్నటువంటి ధైర్యమును బలమును, క్రమశిక్షణను అందించేటటు వంటిదే భారతీయ విద్య.
(శ్రీ.ది.పు.2)