పరమపావనమైన భారతావనియందు
సహసమన్సదె మనకు చక్కదనము
వ్రతములన్నిటిలోన ఎన్నెగాంచినయట్టి
ఘనసత్యశీలమే కఠిన తపము
మధురభావంబేది మనదేశమందన్న
మాతృభావముకన్న మాన్యమెద్ది
ప్రాణంబుకంటెను మానంబు ఘనమును
మనదేశ నీతిని మంటగలిపి
నేటికిచ్చిరి పరదేశనీతులరసి
వెసవిచిత్ర స్వేచ్చయన్ విచ్చుకత్తి
ఔర ఏమందు భారతపాలనంబు
ఎనుగెట్టుల తవ బలమెరుగదొ
అట్టులైనారు మనవారలపని నేడు!
(శ్రీ...పు. 156)