ఒక సమయములో తులసీదాసు గోస్వామివారు ఈక్రింది రీతిగా అనిరి. "ఇంటిలోపలా, వెలుపలా, వెలుతురు కావాలంటే గడప పైన దీపము పెట్టవలసి వచ్చును. అట్లే నీలోనూ, నీ వెలుపలనూ శాంతి ప్రకాశము ప్రసరించవలెనంటే, నీ ఆంతర్బాహ్యరంగాలలో "శాంతి తేజము" కావాలంటే నీ జిహ్వాగ్రమనేగడపయందు నామమము దీపమును నిలుపుకో! అయితే ఈ దీపము ఏ గాలికీ, వానకూ ఆరునది కాదు. అంతేకాక ఆ "నామదీపము" తనకేకాక, ప్రపంచమునకూ , శాంతి తేజమును ప్రసాదించును" ఆత్మ కల్యాణమునకూ, అఖిల ప్రపంచ కళ్యాణమునకు హరి మందిరము, హరినామములు పరమోపాయము, నామస్మరణ చేయుటయే ఒక స్వరూప దర్శనము.
(జ.పు.129)