దుర్గ అనగా శక్తి స్వరూపిణి, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక - ఈ మూడు శక్తులను ప్రసాదించేటటువంటి శక్తి స్వరూపిణినే - దుర్గ అన్నారు. ఇంక లక్ష్మి. ఈమె జ్ఞానైశ్వర్యమును, గుణైశ్వర్యమును ఇంకా అనేక రకములైన అనుభివించదగిన ఐశ్వర్యములనంతా అనుగ్రహించే టటువంటిది. ఐశ్వర్యమన గా కేవలం కరెన్సీ నోట్స్ మాత్రమే కాదు. మన ఆరోగ్యము కూడా ఐశ్వర్యమే, సర్వైశ్వర్య స్వరూపిణి అయినటువంటిదే లక్ష్మి. ఈ లక్ష్మి సంపద స్వరూపిణి, ఐశ్వర్య స్వరూపిణి. ఇంక సరస్వతి. ఈమె మనకు తెలివి తేటలను, విచారణా శక్తిని ప్రసాదించునటు వంటిది. దుర్గా లక్ష్మీ సరస్వతుల యొక్క ప్రభావాన్ని ప్రపంచమునకు చాటే నిమిత్తమై ఈ శరన్నవరాత్రులు ఉత్సవములుగా వచ్చాయి.
(స.సా.ఆ 93 వెనుక పుట)