భద్రాచలం రామదాసు చాల పాటలను రచించి వాటిలో ఏవి శ్రీరామునికి నచ్చినవో నిర్ణయించుకొనుటకు, వాటినన్నిటిని గోదావరిలో పారవేసి, “రామ చంద్రా నీకు సంతృప్తి కలిగించిన పాటలను ఎన్నుకొనుము" అని వేడినాడు. అంతట వాటిలో 108 కీర్తనలు మట్టుకు నీటిపైకి తేలి, మిగిలిన వన్నియూ మునిగిపోయినవి! ఆ 108 మాత్రమేతాను హృదయపూర్వకముగా వ్రాసినవని, మిగిలినవన్నియూ పాండిత్య ప్రకటన, శబ్ద జాలము, మాటల చమత్కృతి, బుద్ధి కుశలత వలన వెలువడినవి అని నిర్ణయించెను. అట్టి కీర్తనలు భగవంతునికి నచ్చవని గ్రహించెను.
(త.శ.మ.పు.302)