ఘృష్టం ఘృష్టం పునరపి పున: చందనం చారురమ్యం!
ఛిన్నం ఛిన్యం పునరపి పునః స్వాదు ఇక్షు కాండం!
దగ్ధం దగ్ధం పునరపి పునః కాంచనం కాంతివర్గం:
నప్రాణాంతే ప్రకృతిర్వికృతిర్జాయతే ఉత్తమానాం||
"గంధపు చెక్కను అరగదీసిన కొలది సుగంధ పరిమళాన్ని అనుభవించగలుగుచున్నాము. చెఱుకును నమిలిన కొలది అతి మధురమైన రసమును గ్రోలగలుగుచున్నాము. బంగారాన్ని అగ్నిలో వేసి కాల్చిన కొలది, దాని మాలిన్య మంతయు తొలగింపబడి, పరిశుద్ధమైన అపరంజిని పొందగలుగుచున్నాము. అట్లే, మానవుడీ లోకంలో కష్ట నష్టాలు, విచారాలనెడు వికృతులను ఎన్ని అనుభవించి నప్పటికీ, తాను స్థిరచిత్తుడై భగవద్విశ్వాసము" ను కల్గియుండిచో- అతడే ఉత్తమమైన మానవుడుగా రాణింపగలడు".
(స.సా.సె..91 పు.225)