ఈనాడు. ఏవరైనాసరే, భగవద్భక్తులుగా ఉండేవారు. భగవద్భక్తులమని విశ్వసించేవారు మాంసభక్షణమును వదలాలి. కారణమేమిటి? పశుమాంసము పశుగుణములనే పెంచుతుంది. హిందీలో చెబుతారు. జైసే అన్నే ఐసే మన్" ఎలాంటి తిండోఅలాంటి త్రేపు. క్రూర మృగములయొక్క మాంసమును భుజించడం చేత మనలో కూడా క్రూరత్వము అభివృద్ధి అవుతున్నది. ఇది ఒక్కటేకాదు, పరప్రాణులను చంపడం ఎంత పాపం! కనుక, నిజమైన దైవభక్తులు కావాలని ఆశించేవారు మాంస భక్షణమును పూర్తిగా వదలాలి. "మేము సాయి భక్తులం, రామ భక్తులం, కృష్ణభక్తులం..." అని చెప్పుకుంటూ, కోళ్ళు కోసుకుని తింటూ కూర్చునేవారు భక్తులు ఎలా అవుతారు? వారు కేవలం రాక్షసులే! అలాంటి వారిని భగవంతుడే మాత్రం అను గ్రహించడు. కనుక, ఎవరైనా సరే, స్వదేశీయులు కాని, విదేశీయులు కాని -స్వామి ఆజ్ఞను పాటించేవారు మాంస భక్షణమును తక్షణమే వర్ణించాలి.
మనము నీరు తీసుకుంటున్నాము. నీటిలో ప్రాణశక్తి జీవశక్తి ఉంటున్నది. నీరు పవిత్రమైన భగవదంశము భగవంతుని (శంకరుని జటాజుటము) నుండియే నీరు ఆవిర్భవిస్తున్నది. అలాంటి నీటిని వదలి "బాటిలు"ని తీసుకోవడం తప్పు! మద్యపానము మహా ప్రమాదకరమైనది. తనను తాను మరపిస్తుంది.గౌరవమును తీసివేస్తుంది, మానవత్వాన్ని దూరం చేస్తుంది. దివ్వత్వాన్ని మరపిస్తుంది. త్రాగినవాడు తాను ఏమి చేస్తున్నాడో, ఏమి చూస్తున్నాడోతనకే తెలియదు "ఊ..." అని ఊగుతూంటాడు. అట్టి వానిని చూస్తే ఎంతో అవమానమనిపిస్తుంది. నవ్వు వస్తుంది. వీడు మానవుడై ఈ విధముగా ప్రవర్తిస్తున్నాడే అని బాధనిపిస్తుంది. ఈ మద్యపానము వల్ల కొన్ని కుటుంబములు నాశనమైపోతున్నాయి. కొందరు తాము సంపాదించిన ధనమంతా మద్యపానమునకు వినియోగిస్తూ కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను ఏమాత్రం సాకటం లేదు. తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను పోషించలేనివాడు ఇంట ఉండి ఏమి ప్రయోజనం? ఈ దురవస్థకు మూల కారణం మద్యపానమే. అంతేకాదు. కొంతమంది మద్యపానముతోపాటు సిగరెట్లను కూడా - కాలుస్తుంటారు. ఈ సిగరెట్లమూలంగా ఆస్త్మా, ఇస్నోఫీలియా, గుండెజబ్బులు మున్నగునవి ఏర్పడుతున్నవి. సిగరెట్లను కాల్చి కన్నబిడ్డను ముద్దుపెట్టుకుంటే వానికి "కాన్పరు" వస్తుంది. ఈ ధూమపానం వల్ల కలిగే అపాయమునకు ప్రత్యక్ష ప్రమాణమును కూడా నిరూపించవచ్చు. ధూమ పానము చేసినప్పుడు తెల్లని బట్ట తీసుకుని దాని మీద ఊదండి. ఆ తెల్లని బట్టపైన ఎఱ్ఱని మచ్చ ఏర్పడుతుంది. ఆ పొగవల్ల బట్టనే ఇంత పాడైనప్పుడు, ఇంక పొగత్రాగితే మన రక్తనాళములు ఎంతగా, చెడిపోతాయో! ఇది ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్మూలిస్తుంది. జీవిత ప్రమాణాన్ని నశింపజేస్తుంది.
కనుక, నిజమైన దైవభక్తులు కాగోరువారు మాంస భక్షణ, మద్యపానము, ధూమపానము ఈ మూడింటిని పూర్తిగా మానివేయాలి. ఏ ప్రభుత్వమూ దీనిని ఆపలేదు. ఎవరి భావములలో వారికి మార్పు రావాలి. ఇది మానసిక పరివర్తన వలన వస్తుంది. కాని, పరుల వలన వచ్చేది కాదు ఎరికి వారు సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
(శ్రీ భ.ఉ.పు.160)