పిల్లలు భోజనం చేసే ముందుగా భగవంతుని ప్రార్థించిభోజనం ప్రారంభిస్తారు. ఏవిధంగా ప్రార్థిస్తున్నారు?
బ్రహ్మార్పణం బ్రహ్మహవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మ కర్మ సమాధినా.
బ్రహ్మార్పణం చేస్తున్నామంటున్నారు.
ఈ బ్రహ్మ మీలోపలనే ఉన్నాడు. కదా. అందువల్ల తక్షణమే జవాబు వస్తున్నది. ఏమని?
అహం వైశ్వా నరోభూత్వా ప్రాణినాం దేహ మాశ్రితః
ప్రాణా పాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధమ్.
"నేను వైశ్వానర రూపంలో నీ లోనే ఉండి, నీవు భుజించిన ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాను" అని. లేకపోతే నీ కడుపులోకి పోయిన ఆహారాన్ని ఎవరు జీర్ణము చేస్తున్నారు? దేహములో సంచరించే రక్తమునకు ఆక్సీజను ఎవరిస్తున్నారు? 24 గంటలు నీ గుండె కొట్టుకోటానికి ఎవరు మిషను పెట్టారు? అంతా భగవంతుని సృష్టియే. ఇది అగమ్యగోచరమైనది; ఎవరూ అర్థము చేసుకోవటానికి వీలుకానిది. భగవంతుడు ఈ సృష్టియందు మానవత్వానికి తగిన తెలివితేటలను, ప్రత్యేక జ్ఞానాన్ని కూడా అందించాడు. దీనినే వేదం "ప్రజ్ఞానం బ్రహ్మ" అన్నది. దీనినే Constant Integrated Awareness అన్నారు. ఇది మార్పు చెందనిది: ఏ సమయమునందైనా నిశ్చలంగా ఉండేది.
(ద.స.98 పు.90)
(చూ|| ప్రార్థిన )