జీవ బ్రహ్మముల యొక్క ఏకత్వమును దృఢముగా గుర్తెరిగి అసంభావన - విపరీతభావములనుoడి సంశయ నివృత్తి గాంచుటయే దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞాన మనబడును. అట్టి దివ్యమయిన జ్ఞానోదయము వలన అభాస అపర్ణ ము తొలగిపోవును.
బ్రహ్మజ్యోతి నాయందు వెలుగుటలేదు అనెడి తప్పు అభిప్రాయమునే ఆభాస ఆవర్ణమని అందురు. ప్రతి జీవి హృదయ మందు. పరమాత్మ సూక్షమున అతి సూక్ష్మముగాను, గొప్పలో అతి గొప్పగాను వున్నాడు.కావున అంతరంగ మందున్న ఆత్మ సందర్శనము చేయగలిగిన జ్ఞాని ఎన్నడును దు:ఖింపడు. ఆత్మ సర్వభూతములందూ చీమ మొదలు ఏనుగు వరకూ సర్వత్రా ఉన్నది. ప్రపంచము అతిసూక్ష్మమగు ఆత్మచేతవ్యాపింపబడినది. సాధకుడు ప్రపంచ ధోరణిని త్యజించి, అంతర్ముఖుడై ఆత్మ యందు దృష్టి మరలింపవలెను. మనోవృత్తులన్నియు ఎచ్చట నుండి ఉత్పన్న మగుచున్నవో గ్రహింపనగును. అట్లు గ్రహించినచో సంకల్పములన్నియు నాశనమగును. అటు తరువాత, బ్రహ్మాకారవృత్తి నిరంతరాయముగ గల్గును. దాని వలన సాధకుడు సచ్చిదానంద స్వరూపస్థితియందు స్థిరపడును. అట్టి జ్ఞానిని ఎట్టి సుఖదుఃఖములును అంటజాలవు. తాను ఆత్మానంద సాగరమున పూర్తిగా మునిగి ప్రపంచమున కతీతుడై యుండును ఆత్మచింతన అనెడి పదమునే బ్రహ్మాభ్యాసమనియు, జ్ఞానాభ్యాసమనియు కూడా వాడుదురు.
(జ్ఞా.వాపు 9/10)
(చూ|| బ్రహ్మచింతను)