కోరిన ఫలమిచ్చు కల్పవృక్షము యుండ
పెరటి పుష్పమునకై ప్రీతి ఏల?
అడిగిన పాలిచ్చు కామధేనువె యుండ
ధనమిచ్చి ఆవును కొనగ నేల?
మెండగు కాంతితో మేరు పర్వతముండ
వెండి బంగారుకై వెదకనేల?
భక్తి ముక్తులనిచ్చు పరమాత్ముడేయుండ
పాడు సంసారము కోరనేల?
(స.సా.మే. 1993 పు. 99)
(చూ|| తిరువళ్ళవరు, దైవామగ్రహము)