నీవు భగవంతునికి ఇవ్వవలసింది ఏమిటి? పత్రమో, పుష్పమో, ఫలమో... అనుకుంటావు. ఇవి భగవంతుని వద్ద లేకపోలేదు. భగవంతుడు కోరేది ఏమీ లేదు. “మీరు కూడా భగవంతుడు కండి" అని కోరుతుంటాడు. కాని, ఇట్టి విశాలమైన భావాన్ని విస్మరించి, భగవంతునికి తుచ్చమైన బొచ్చు నిచ్చి తుచ్ఛమైన కోరికలు కోరుతుంటావు. తిరుపతి వేంకటేశ్వరస్వామి ఏమి తక్కువ? విశ్వాన్ని ఏలే భగవంతునికి ఏమి తక్కువ? అతనికి నీ పాత బొచ్చు, పేడబొచ్చు ఎందుకు? కనుక, భగవంతునికి ఇవ్వవలసింది తుచ్చమైన బొచ్చుకాదు. దీనికి మరొక అర్గమున్నది. తల పైన వెంట్రుకలు తమో గుణానికి చిహ్నము. కనక, తిరుపతికి పోయే వారు తమెగుణమున భగవంతునికిచ్చి సాత్వికమనే గుణమును తీసుకొని రావాలి. అంతేగాని తిరుపతికి పోయి, జుత్తునిచ్చి వచ్చావనడం గొప్పతనం కాదు. ఇది అల్ప బుద్దుల లక్షణం. ఈ అల్ప విషయాలలో విశ్వాసం పెట్టుకొని నిజమైన విశ్వాసము కోల్పోవుచున్నావు. భగవంతునికి నీవిచ్చేది ఏమీ లేదు.
(శ్రీ..ఉ.పు.178)