"ప్రతి దేశమునకు ఒక మంత్రి మండలి ఉంటుంది. దానికి ప్రధాన మంత్రి అధిపతి. అతనొక్కడే అన్ని శాఖలను చూడటం కష్టం కనుక, ఆర్థిక, రవాణా, పోలీసు, పరిపాలన మొదలగు అనేక శాఖలుగా విభజించి, మంత్రులకు ఆయా శాఖలను కేటాయించబడుతాయి. ప్రధానమంత్రి అతి ముఖ్యమైన శాఖలను కొన్నింటిని తన అధీనంలో ఉంచుకుంటాడు. ఈ విధంగా విభజించటం వలన ఏ శాఖకు చెందిన Files ఆ శాఖకు చెందిన మంత్రివద్దకే వెళ్ళుతాయి. ప్రధానమంత్రి పెద్దవాడు కదా! అని అతని దగ్గరకు అన్ని Files వెళ్ళవు అదే విధముగా భగవంతుని సృష్టియందు కూడా పరిపాలనలో అనేక శాఖలుగా విభజించబడి ఇంద్రుడు, వరుణుడు, వాయువు, అగ్ని రుద్రుడు వంటి మంత్రులకు కేటాయించబడినాయి. వారు వారి శాఖలను పరిపాలన చేస్తుంటారు. అయితే భగవంతుడు. ప్రధానమంత్రి (Prime Minister) వలె అన్నింటిని పర్యవేక్షిస్తూ తన అధీనంలో వుంచుకొనిన శాఖల పైన ప్రత్యేకమైన దృష్టిని పెట్టి పరిపాలన కొనసాగిస్తుంటాడు. భగవంతుని అధీనంలో మూడు ప్రధాన శాఖలున్నాయి. 1. నిష్కాము కర్మ 2 అనంత ప్రేమ 3. నిర్మల చిత్తము. ఈ మూడు మార్గముల ద్వారా వచ్చే ప్రార్ధనలన్నీ భగవంతునికి DIrect గాచేరతాయి. మిగిలిన ప్రార్థనలన్నీ భగవంతునికి Directగా చేరడానికి వీలుకాదు. కనుక మనం ఈనాడు Direct గా భగవంతుని అనుగ్రహాన్ని, ఆశీస్సులను, అనుమతిని పొందాలంటే, ఈ మూడు మార్గముల ద్వారానే పొందటానికి వీలవుతుంది. ఈ మూడింటి యందు నిష్కామకర్మ ప్రధానమైనది".
(శ్రీ.న.2000పు.32)