పరమాత్మునికి భావమే ముఖ్యం. అణుమాత్రమైన పదార్థములో బ్రహ్మాడమంత భావాన్ని భక్తులు నింపగలరు.ద్రౌపది ఇచ్చిన ఆ చిన్న బలుసాకులో అంత భావం ఉండటం వల్లనే సృష్టి అంతయు తృప్తి పడింది; క్షుద్భాధ ఒకే క్షణంలో తీరిపోయింది. రుక్మిణి త్రాసులో వేసిన ఒకే ఒక తులసీ దళములో ఆ భావం ఇమిడి యుండుటవల్లనే పధ్నాలుగు లోకములను తన బొజ్జలో ధరించిన భగవంతునికి అది సమముగా తూకమైనది. ఎటువంటి దానికి తాను తూగగలడు, అనేది చూపించడానికే కృష్ణుడు ఈప్రకరణాన్ని జరిపించినాడు. ఇంక, కుచేలుడు తెచ్చిన ఆ పిడికెడు అటుకులకు ఆనాడు ఒక నయాపైస కూడా విలువ ఉండదు. అయినా వాని భార్య భక్తి శ్రద్ధలతో, వినయ విశ్వాసములతో ఇచ్చినది కాబట్టి, అది అంత ఫలిత మిచ్చినది. కొండంత పరమాత్మునికి కొండంత పూలు అక్కరలేదు. అణువంత పదార్థములోనే బ్రహ్మాండమంత భావాన్ని ఇమడ్చాలి. అదియే భక్తికి గుర్తు.
(స.సా. అ.99పు.వెనుకకవరుపుట)