కర్త, కర్మ, క్రియ లన్నియు పరమాత్మను ఆశ్రయించి యున్నవని నమ్మకము కలిగి దైవమునకు భక్తులు కావలెను. కాని, ధనమునకు దారాదులకు, పుత్రాదులకు, భక్తులు రక్తులు కారాదు. అభిమాన మెక్కడో అక్కడ దైవభక్తి అని చెప్పచెల్లదు. భక్తి పరిశుద్ధమైన గంగ వంటిది. కర్మయమునవంటిది. జ్ఞానము గుప్త గామినియైన సరస్వతి వంటిది. ఇది బైటికి కనుపించునది కాదు. ఈ మూడింటి సమ్మేళన త్రివేణి అని పిలువ బడును.
అట్టి త్రివేణి, అనగా త్రిగుణముల యేకత్వమే మనోలయము, అదియే మమకార రహితమని అందురు.
(గీ.పు.190)
ఆధ్యాత్మిక త్రివేణిలో, భక్తి - గంగ; వైరాగ్యము - యమున జ్ఞానము - సరస్వతి (అంతర్వాహిని). - జ్ఞాన భక్తి కర్మలు, ముక్తికి; రైలు మార్గములు. వాటిలో జ్ఞానము సరాసరి నీ గమ్యమునకు పోవు రైలు (Through train) నీవు దానిలో నెక్కి కూర్చుండిన చాలు. భక్తి, నేరుగగా పోవు పెట్టె (Through carriage). అది యక్కడక్కడ, ఒక బండి నుండి వేరుచేయబడి, మరియొక బండికి తగిలింపబడుచుండును. అయినను, నీ వందులో స్థిరముగా కూర్చుండి యుంటివేని, నిన్నది నిష్కర్షగా నీ యుద్ధిష్ట స్థానమును చేర్చును. నీవు నిశ్చింతగా నుండ వచ్చును. కర్మమార్గము - సాధారణపు రైలు (Ordinary train). అది ప్రతి కూడలి (Junction) లోను, లైను మారుచుండును. అందువలన, నీవు ప్రతి జంక్ష నులోను, సరుకు సామానులతో దిగి మరియయొక రైలు ఎక్కవలసియుండును. అట్లు దిగుచూ . ఎక్కు చూ, ఎప్పటికో గమ్యము చేరుకొందువు. అది యధిక ప్రయాసతో కూడినపని. (శ్రీ సత్య సాయి వచనా మృ తము 1964 పు 164)