Science and Technology మానవునికి Head (తల) వంటిది" అని అన్నాడు మన ప్రెసిడెంట్. అయితే, మానవునికి కేవలం హెడ్ ఉండినంతమాత్రాన ప్రయోజనం లేదు. Spirituality(ఆధ్యాత్మికము) అతనికి హృదయం (Heart) గా తయారు కావాలి. హృదయం (Heart)లో ఆధ్యాత్మికము, తల (Head)లో సాంకేతిక వైజ్ఞానం, చేతుల (Hands)తో ధర్మం - ఈ మూడు "H లను మనం అభివృద్ధి పరచుకోవాలి. అదే నిజమైన విద్య EHV అనగా Education in Human Values అన్నారు. కాని, ఇక్కడ మూడు H లు ఉన్నాయి అవే Heart, Head, Hand. ఈ మూడింటిని ఏకం చేయడమే మానవత్వం. వీటినే వేదాంత పరిభాష యందు "త్రికరణములు" అన్నారు. ఈ త్రికరణ శుద్ధి ద్వారానే జ్ఞానసిద్ధి కలుగుతుంది.
(స. సా.. ఆ. 92 పు.186)
(చూ|| గాయత్రి)