త్యజించవలసింది ప్రపంచాన్ని కాదు. ఇక్కడే చాలమంది పొరబడుతుంటారు. రామానందతీర్థ స్వామి సన్యసించిన తరువాత భార్యని చేరినప్పుడు ముఖమును ప్రక్కకు త్రిప్పుకున్నాడు. అది గమనించి ఆమె, "స్వామి! మీరు నన్ను చూసినపుడు భార్య అన్న భావం కలగటం వల్ల ముఖాన్ని ప్రక్కకు తిప్పుకున్నారు. కాని నాకా భావంలేదే!" అన్నది. ఆ తర్వాత ఆమెనే ఆయనకూ దీక్షా వస్రాల నిచ్చింది. కనుక లోకాన్ని కాదు. లోకభావాన్ని విసర్జించాలి. Properties ను త్యజించనక్కరలేదు. భగవంతునితో Proper ties ఉండాలి.
(స.పా.ఫి. 97 పు.47)